Share News

Tanvi Sharma: 17 ఏళ్ల తర్వాత..

ABN , Publish Date - Oct 18 , 2025 | 04:02 AM

బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్స్‌లో తన్వీశర్మ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. తద్వారా కనీసం కాంస్య పతకాన్ని ఖరారు...

Tanvi Sharma: 17 ఏళ్ల తర్వాత..

  • మహిళల సింగిల్స్‌లో భారత్‌కు పతకం

  • సెమీస్‌ చేరికతో తన్వీకి కాంస్యం ఖరారు

గువాహటి: బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్స్‌లో తన్వీశర్మ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. తద్వారా కనీసం కాంస్య పతకాన్ని ఖరారు చేసుకుంది. దాంతో ఈ చాంపియన్‌షి్‌ప్సలో 17 ఏళ్ల తర్వాత పతకం సాధించిన భారత మహిళా షట్లర్‌గా తన్వీ రికార్డు నెలకొల్పింది. ఈ టోర్నీలో చివరిసారిగా 2008లో సైనా నెహ్వాల్‌ స్వర్ణ పతకం నెగ్గిది. ఇక.. శుక్రవారం జరిగిన బాలికల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో తన్వీ శర్మ తొలి గేమ్‌ కోల్పోయినా వెనుకంజ వేయలేదు. పట్టువదలని పోరాటంతో 13-15, 15-9, 15-10తో సాకి మట్సుమోటో (జపాన్‌)పై నెగ్గింది. సెమీఫైనల్లో లి సి యా (చైనా)తో తన్వీ అమీతుమీ తేల్చుకోనుంది. అయితే మరో క్వార్టర్‌ ఫైనల్లో ఎనిమిదో సీడ్‌ ఉన్నతి హుడా 12-15, 13-15తో రెండో సీడ్‌ అన్యపత్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో ఓటమి చవిచూసింది. బాలుర సింగిల్స్‌ రౌండ్‌-8 పోరులో జ్ఞానదత్తు 11-15, 13-15తో మూడో సీడ్‌ యాంగ్‌ మింగ్‌ (చైనా) చేతిలో పోరాడి ఓడాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో భవ్య/విశాఖ టోపో 9-15, 7-15 హంగ్‌ బింగ్‌/చౌ యున్‌ (తైపీ) చేతిలో క్వార్టర్‌ఫైనల్‌ పరాజయంతో టోర్నమెంట్‌ నుంచి నిష్క్రమించారు.

Updated Date - Oct 18 , 2025 | 04:02 AM