Nitish Kumar Reddy: టీ20 సిరీస్.. మూడు మ్యాచ్‌లకు నితీశ్ దూరం!
ABN , Publish Date - Oct 29 , 2025 | 04:22 PM
టీమిండియా ఆటగాళ్లను గాయాల బెడద వేధిస్తోంది. ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. రెండో వన్డేలో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి గాయంతో వైదొలిగాడు. అప్పటి నుంచి వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నాడు. కాగా నితీశ్ గాయంపై బీసీసీఐ అప్‌డేట్ ఇచ్చింది.
టీమిండియా ఆటగాళ్లను గాయాల బెడద వేధిస్తోంది. ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. రెండో వన్డేలో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy) గాయంతో వైదొలిగాడు. అప్పటి నుంచి వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నాడు. కాగా నితీశ్ గాయంపై బీసీసీఐ(BCCI) అప్‌డేట్ ఇచ్చింది.
‘నితీశ్ కుమార్ రెడ్డి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఇప్పుడు ఐదు టీ20ల సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌లకు నితీశ్ దూరంగా ఉంటాడు. అతడు ఎడమ తొడ కండరాల నొప్పి నుంచి కోలుకుంటున్నాడు. అడిలైడ్‌లో నితీశ్ గాయంతో ఇబ్బంది పడ్డాడు. మెడ నొప్పితో పాటు ఇతర సమస్యలు ఉన్నాయని వైద్యుల దృష్టికి తీసుకొచ్చాడు. అతడిని మా మెడికల్ టీమ్ నిరంతరం పర్యవేక్షిస్తోంది’ అని బీసీసీఐ పోస్ట్ పెట్టింది.
మళ్లీ కలిసిరాని టాస్..
టీమిండియాకు మరోసారి టాస్ కలిసి రాలేదు. ఆస్ట్రేలియాతో తొలి టీ20 మ్యాచ్‌లోనూ టాస్ ఓడింది. మరోవైపు ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ టీ20ల్లో 18 సార్లు టాస్ నెగ్గగా.. ప్రతిసారీ బౌలింగ్‌నే ఎంచుకోవడం గమనార్హం. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత జట్టు బ్యాటింగ్‌కు దిగింది. అభిషేక్ శర్మ(19) పెవిలియన్ చేరగా.. సూర్య కుమార్ యాదవ్(39), శుభ్‌మన్ గిల్(37) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా స్కోరు వికెట్ నష్టానికి 97 పరుగులు.
Also Read:
Bihar Elections: పీఎం, సీఎం సీట్లు ఖాళీగా లేవు.. అమిత్‌షా
IND vs AUS : టాస్ గెలిచిన ఆసీస్.. తుది జట్లు ఇవే