Share News

IND vs AUS : టాస్ గెలిచిన ఆసీస్.. తుది జట్లు ఇవే

ABN , Publish Date - Oct 29 , 2025 | 01:54 PM

భారత్-ఆస్ట్రేలియా మధ్య కాన్‌బెర్రా వేదికగా తొలి టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో టీమిండియా మొదట బ్యాటింగ్‌కు దిగనుంది.

IND vs AUS : టాస్ గెలిచిన ఆసీస్.. తుది జట్లు ఇవే
India vs Australia

కాన్‌బెర్రా, అక్టోబర్ 29: భారత్-ఆస్ట్రేలియా(IND vs AUS) మధ్య కాన్‌బెర్రా వేదికగా తొలి టీ20(1st T20 Canberra) మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్(Mitchell Marsh) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో టీమిండియా మొదట బ్యాటింగ్‌కు దిగనుంది. ఇటీవలే వన్డే సిరీస్‌ను ఆతిథ్య జట్టు 2-1 తేడాతో సొంతం చేసుకున్నప్పటికీ.. టీ20 సిరీస్‌లో భారత్‌న్ ఓడించడం అంత సులువైన విషయం కాదని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ఫార్మాట్‌లో సూర్య కుమార్ యాదవ్(Suryakumar Yadav) సారథ్యంలో టీమిండియా అద్భుతంగా రాణిస్తుంది. సూర్య కెప్టెన్సీలో భారత్ 80శాతానికి పైగా టీ20 మ్యాచ్‌లు గెలుపొందింది.


ఆసీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ కాన్‌బెర్రాలోని మనుకా ఓవల్‌లో జరుగుతోంది. టీ20 ఫార్మాట్‌లో ఈ రెండు జట్లు ఇక్కడ తలపడటం ఇది రెండోసారి. చివరిసారిగా ఈ జట్లు 2020లో టీ20 మ్యాచ్ ఆడాయి. ఆ మ్యాచ్‌లో టీమిండియా 161 పరుగుల లక్ష్యాన్ని సులువుగా ఛేదించి గెలిచింది. కాన్‌బెర్రాలో వాతావరణం ఇప్పుడు చలిగా ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.


తుది జట్లు ఇవే..

భారత తుది జట్టు: అభిషేక్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), తిలక్‌ వర్మ, సంజు శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), శివమ్‌ దూబె, అక్షర్‌ పటేల్‌, హర్షిత్‌ రాణా, కుల్‌దీప్‌ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి, జస్‌ప్రీత్‌ బుమ్రా.

ఆసీస్‌ తుది జట్టు: మిచెల్‌ మార్ష్‌ (కెప్టెన్‌), ట్రావిస్‌ హెడ్‌, జోష్‌ ఇంగ్లిస్‌ (వికెట్‌ కీపర్‌), టిమ్‌ డేవిబడ్‌, మిచెల్‌ ఓవెన్‌, మార్కస్‌ స్టోయినిస్‌, జోష్‌ ఫిలిప్‌, జేవియర్‌ బ్రాట్‌లెట్‌, నాథన్‌ ఎల్లిస్‌, మాథ్యూ కుహ్నెమాన్‌, జోష్‌ హేజిల్‌వుడ్‌.


Also Read:

తేల్చి చెప్పిన డీసీఎం.. నీ సలహాతో ప్రాజెక్టు ఆపలేం...

ధరల తగ్గుదలకు బ్రేక్.. మళ్లీ పెరిగిన గోల్డ్ రేట్స్

Updated Date - Oct 29 , 2025 | 02:12 PM