Gold Rates On Oct 29: ధరల తగ్గుదలకు బ్రేక్.. మళ్లీ పెరిగిన గోల్డ్ రేట్స్
ABN , Publish Date - Oct 29 , 2025 | 01:13 PM
బంగారం ధరల్లో తగ్గుదలకు బ్రేక్ పడింది. నిన్నటితో పోలిస్తే నేడు రేట్స్ స్వల్పంగా పెరిగాయి. మరి ప్రస్తుతం వివిధ నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు బుధవారం స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, బుధవారం మధ్యాహ్నం 12.00 గంటలకు 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర నిన్నటితో పోలిస్తే రూ.760 మేర పెరిగి రూ.1,21,580గా ఉంది. ఇక 22 క్యారెట్ ఆర్నమెంటల్ బంగారం ధర రూ.700 మేర పెరిగి రూ.1,15,450కు చేరుకుంది. కిలో వెండి ధర కూడా రూ.వెయ్యి మేర పెరిగి రూ.1,52,000కు చేరుకుంది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ బంగారం ధర రూ.1,21,580గా ఉంది. కిలో వెండి ధర రూ.1,66,000గా ఉంది. విజయవాడలో దాదాపు ఇవే రేట్స్ కొనసాగుతున్నాయి (Gold Rates on Oct 29).
ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ (31.10 గ్రాములు) 24 క్యారెట్ పసిడి స్పాట్ ధరలు 0.2 శాతం మేర పెరిగి 3,957 డాలర్లకు చేరుకున్నాయి. ప్రస్తుతం బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులను దిద్దుబాటుగా మాత్రమే చూడాలని, ఇది దీర్ఘకాలిక ట్రెండ్ కాదని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పటివరకూ ధరలు ఏకంగా 50 శాతం మేర పెరిగిన నేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడం సర్వసాధారణం. అయితే, అమెరికా, చైనా ఉద్రిక్తతలు తగ్గుతున్న వేళ ధరలు మరింత తగ్గే ఛాన్సు ఉందన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది.
పసిడి ధరలు ఇవీ (24కే, 22కే, 18కే)
చెన్నై: ₹1,22,290; ₹1,12,100; ₹93,500;
ముంబై: ₹1,21,580; ₹1,11,450; ₹91,190;
ఢిల్లీ: ₹1,21,730; ₹1,11,600; ₹91,340;
కోల్‌కతా: ₹1,21,580; ₹1,11,450; ₹91,190;
బెంగళూరు: ₹1,21,580; ₹1,11,450; ₹91,190;
హైదరాబాదు: ₹1,21,580; ₹1,11,450; ₹91,190;
కేరళ: ₹1,21,580; ₹1,11,450; ₹91,190;
పూణె: ₹1,21,580; ₹1,11,450; ₹91,190;
వడోదరా: ₹1,21,630; ₹1,11,500; ₹91,240;
అహ్మదాబాద్: ₹1,21,630; ₹1,11,500; ₹91,240;
వెండి ధరలు ఇలా (కిలో)
చెన్నై: ₹1,66,000;
ముంబై: ₹1,52,000;
ఢిల్లీ: ₹1,52,000;
కోల్‌కతా: ₹1,52,000;
బెంగళూరు: ₹1,52,000;
హైదరాబాదు: ₹1,66,000;
కేరళ: ₹1,66,000;
పుణే: ₹1,52,000;
వడోదరా: ₹1,52,000;
అహ్మదాబాద్: ₹1,52,000;
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. వార్త రాస్తున్న సమయానికి ధరల వివరాలు పైన తెలిపిన విధంగా ఉన్నాయి. కాబట్టి బంగారం కొనుగోలు చేసే ముందు.. ధరలు మళ్లీ ఒకసారి పరిశీలించుకోగలరు.
ఇవీ చదవండి:
Indias IT Market: 2030 నాటికి రూ.35.32 లక్షల కోట్లు
Apples Market Value: యాపిల్ 4 లక్షల కోట్ల డాలర్లు
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి