Nithish Kumar Reddy: నితీశ్‌ను అందుకే పక్కన పెట్టారా..?
ABN , Publish Date - Oct 25 , 2025 | 12:33 PM
గాయం కారణంగా నితీశ్, అర్ష్‌దీప్‌లను పక్కన పెట్టి వీరి స్థానాల్లో కుల్‌దీప్, ప్రసిద్ధ్ కృష్ణను తీసుకుంది. తాజాగా నితీశ్ గాయంపై బీసీసీఐ స్పందించింది. ‘రెండో వన్డే ఆడుతున్నప్పడు నితీశ్ ఎడమ తొడ కండరాలు పట్టేశాయి. అందుకే మూడో వన్డే సెలక్షన్ కోసం..
ఆస్ట్రేలియాతో భారత్ మూడో వన్డే సిరీస్ ఆడుతోంది. దీని కోసం ప్రకటించిన భారత తుది జట్టులో ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి(Nithish Kumar Reddy)కి చోటు దక్కలేదు. ఈ సిరీస్‌తోనే వన్డేల్లోకి అడుగుపెట్టిన నితీశ్‌ను ఎందుకు పక్కన పెట్టారనే సందేహం అందరిలో మొదలైంది. ఇప్పటికే ముగ్గురు ఆల్‌రౌండర్లతో ఆడించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆసీస్ 2-0తో సిరీస్ సొంతం చేసుకున్నప్పటికీ ఈ నామమాత్రపు మ్యాచ్‌లో గెలవాలన్న ఉద్దేశంతో రెండు మార్పులతో టీమిండియా(Team India) బరిలోకి దిగింది.
గాయం కారణంగా నితీశ్, అర్ష్‌దీప్‌లను పక్కన పెట్టి వీరి స్థానాల్లో కుల్‌దీప్, ప్రసిద్ధ్ కృష్ణను తీసుకుంది. తాజాగా నితీశ్ గాయంపై బీసీసీఐ(BCCI) స్పందించింది. ‘రెండో వన్డే ఆడుతున్నప్పడు నితీశ్ ఎడమ తొడ కండరాలు పట్టేశాయి. అందుకే మూడో వన్డే సెలక్షన్ కోసం అతడు అందుబాటులో లేడు. బీసీసీఐ మెడికల్ టీమ్ అతడి పరిస్థితిని పర్యవేక్షిస్తోంది’ అని వెల్లడించింది. ఈ క్రమంలో నితీశ్ టీ20 సిరీస్‌లో ఆడటంపై అభిమానుల్లో అనుమానం కలుగుతోంది. మరో మూడు రోజుల్లోనే ఆసీస్‌తో భారత్ టీ20 సిరీస్ ఆడనుంది.
కలిసిరాని టాస్..
టీమిండియాకు టాస్ కలిసి రావడం లేదు. వన్డేల్లో వరుసగా 18వ సారి భారత్ టాస్ ఓడింది. కెప్టెన్లు మారినా టాస్ విషయంలో మాత్రం మార్పు రావకపోవడం గమనార్హం. చివరిసారిగా వన్డేల్లో 2023 భారత్ వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌పై టాస్ నెగ్గింది. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు టీమిండియా ఒక్కసారి కూడా టాస్ గెలవలేదు. సిడ్నీ(Sydney) వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో మిచెల్ మార్ష్(Michel Marsh) టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ఇవి కూడా చదవండి..
IND VS AUS: రెండో వన్డేలోనూ భారత్ ఓటమి
Virat Kohli Emotional: అడిలైడ్ మ్యాచ్‌లో భావోద్వేగానికి గురైన విరాట్ కోహ్లీ