Share News

Dhoni Hummer Ride: రూ.80 లక్షల రేర్ హమ్మర్‌తో ధోనీ స్పెషల్ రైడ్..

ABN , Publish Date - Aug 23 , 2025 | 04:31 PM

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎం.ఎస్. ధోనీ గురించి మరోసారి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈసారి క్రికెట్ గ్రౌండ్‌లో కాకుండా, రాంచీ రోడ్లపై ఓ రేర్ హమ్మర్ కారుతో షికారు చేస్తూ కనిపించాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట్ వైరల్ అవుతోంది.

Dhoni Hummer Ride: రూ.80 లక్షల రేర్ హమ్మర్‌తో ధోనీ స్పెషల్ రైడ్..
Dhoni Hummer Ride

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ధోనీ గురించి ఓ క్రేజీ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. తన సొంత ఊరు రాంచీలో ఓ అద్భుతమైన హమ్మర్ కారుతో రోడ్లపై షికారు చేస్తున్నాడు (Dhoni Hummer Ride). అందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ కారు స్పెషల్ ఏంటో ఏంటంటే.. అది భారత సైన్యం థీమ్‌తో కనిపిస్తుంది. ఫైటర్ జెట్స్, ట్యాంకులు, విమానాలు, సైనికుల చిత్రాలతో ఈ కారు థీమ్ నిండి ఉంది. ఇది చూస్తే ఎవరికైనా వావ్ అనిపించక మానదు.


యూనిక్ హమ్మర్‌

ఈ ఆర్మీ థీమ్ డిజైన్ కోసం ధోనీ ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చాడట. రాంచీలో ఉన్న ఓ కార్ డీటైలింగ్ స్టూడియో హౌస్ ఆఫ్ మష్ దీనిని డిజైన్ చేసింది. స్టూడియో ఫౌండర్ అచ్యుత్ కిషోర్ తెలిపిన ప్రకారం 2024లోనే ధోనీ ఈ ఐడియా చెప్పాడట.

ఆ తర్వాత మెల్లగా ఫుల్ కస్టమ్ వర్క్ చేసి, ఈ యూనిక్ హమ్మర్‌ను రెడీ చేశారట. ధోనీ హమ్మర్ H2 మోడల్ ధర సుమారు రూ. 75 లక్షలు అని కార్ దిగ్గజ వెబ్‌సైట్ కార్‌దేఖో తెలిపింది. అయితే ఈ ఆర్మీ థీమ్ కస్టమైజేషన్ వల్ల మోదిఫికేషన్ ఖర్చుతో రూ. 5 లక్షలు పెరిగినట్టు తెలుస్తోంది. అంటే ఈ కార్ మొత్తం విలువ ఇప్పుడు రూ. 80 లక్షల మేర ఉండొచ్చు.


ధోనీ కెప్టెన్సీ

ఇండియా తరపున మూడు ICC ట్రోఫీలు గెలిచిన ధోనీ, 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్ అయ్యాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో మాత్రం ఇంకా ఆడుతూనే ఉన్నాడు. 2025 IPL సీజన్‌లో ధోనీ మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్సీ చేపట్టాడు. రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా ఆడలేకపోవడంతో ధోనీ బాధ్యతలు తీసుకున్నాడు. కానీ ఈ సీజన్ సీఎస్‌కేకు అంతగా కలిసి రాలేదు. మొత్తం నాలుగు మ్యాచుల్లో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో చివర్లో నిలిచింది CSK.


ధోనీ భవిష్యత్‌పై క్లారిటీ

ఐపీఎల్ తరువాత జరిగిన ఓ ఈవెంట్‌లో ధోనీ మాట్లాడుతూ నేను మళ్లీ ఆడతానా లేదా అన్నది ఇంకా తెలియదు. డిసెంబరు వరకు టైమ్ ఉంది. ఇంకొన్ని నెలల తర్వాత నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు. ధోనికి ఇప్పటికే 44 ఏళ్లు వచ్చాయి. మోకాలి గాయం కూడా వదలడం లేదు. అయినా కానీ ధోనీ మైదానంలోకి అడుగుపెడితే అభిమానుల్లో ఉత్సాహమే వేరు. అతడి బ్యాటింగ్‌లో పాత దూకుడు కొంత తగ్గిపోయినా, కెప్టెన్సీలో మాత్రం తన అనుభవాన్ని ఉపయోగిస్తూ జట్టును ఆఖరి వరకు పోరాడేలా చేస్తాడు.


ఇవి కూడా చదవండి

అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?

మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 23 , 2025 | 04:35 PM