Suryakumar Yadav: చాలా తేడా ఉంది.. గిల్‌తో సూర్యను పోల్చలేం: మహ్మద్ కైఫ్
ABN , Publish Date - Dec 23 , 2025 | 03:41 PM
ఇటీవలే టీ20 ప్రపంచ కప్ 2026కి సంబంధించి భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై వేటు పడింది. ఫామ్‌లో లేని సూర్యను ఎందుకు కొనసాగిస్తున్నారంటూ వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ విషయం గురించి మాజీ క్రికెటర్ కైఫ్ స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 కోసం ఇప్పటికే భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. గత కొద్ది కాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న టీ20 వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై వేటు పడింది. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్(Suryakumar Yadav) కూడా ఫామ్‌లో లేడని అతడిని ఎందుకు జట్టులోంచి తప్పించలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విషయంపై టీమిండియా మాజీ ప్లేయర్ మహ్మద్ కైఫ్ స్పందించాడు.
‘గిల్(Shubman Gill ), సూర్య కుమార్ యాదవ్‌ల మధ్య చాలా తేడాలున్నాయి. టీ20ల్లో సూర్య మ్యాచ్ విన్నర్‌గా నిరూపించుకున్నాడు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్-10లో ఉన్నాడు. ఎన్నో మ్యాచుల్లో భారత్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. సూర్యతో గిల్‌ను పోల్చలేం. గిల్ అంతర్జాతీయ టీ20ల్లో ఇంకా తనను తాను నిరూపించుకోవాలి. ఉదాహరణకు కోహ్లీని తీసుకోండి. అతడు కొవిడ్ సమయంలో ఆ రెండేళ్ల పాటు పెద్దగా పరుగులు చేయలేదు. కానీ అంతకుముందు అతనికి గొప్ప రికార్డు ఉంది. పదేళ్ల పాటు మ్యాచ్ విన్నర్‌గా ఉన్నాడు. దీంతో కోహ్లీకి మద్దతుగా నిలవగా.. పేలవ ఫామ్ నుంచి బయటపడి మళ్లీ భారీ స్కోర్లు చేయడం ప్రారంభించాడు. సూర్య కూడా ఈ కేటగిరీలోనే ఉన్నాడు. టీ20 ఫార్మాట్‌లో సూర్యకు గిల్ ఎక్కడా చేరువలో లేడు. ఫామ్‌లో లేరని ఇద్దరిని జట్టు నుంచి తొలగించాలనడం సరికాదు’ అని కైఫ్ వివరించాడు.
ఇవీ చదవండి:
‘చిన్నస్వామి’ నుంచి మ్యాచ్‌లు తరలింపు!
కోహ్లీ మ్యాచ్.. చిన్నస్వామి స్టేడియంలో ఫ్యాన్స్‌కు నో ఎంట్రీ!