Jemimah Rodrigues Sunil Gavaskar: జెమీమా స్పెషల్ రిక్వెస్ట్.. స్పందించిన సునీల్ గవాస్కర్
ABN , Publish Date - Nov 05 , 2025 | 09:02 PM
జెమీమా రిక్వెస్ట్ పై తాజాగా గవాస్కర్ స్పందించాడు. ఓ వీడియోను రిలీజ్ చేస్తూ పలు విషయాలను ప్రస్తావించాడు. 'హాయ్ జెమీమా. ముందుగా, ఐసిసి మహిళల ప్రపంచ కప్ గెలిచినందుకు మీకు, మీ బృందానికి అభినందనలు' అని అన్నాడు.
క్రీడా వార్తలు: దశాబ్దకాలంగా అందని ద్రాక్షలాగా ఊరిస్తూ వస్తున్న మహిళల వన్డే ప్రపంచకప్‌ను భారత్ అందుకుంది. ఆదివారం (నవంబర్ 2)నాడు నవీ ముంబై వేదికగా జరిగిన ప్రపంచకప్ 2025(World cup) ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా(South Africa)ను చిత్తు చేసి మరీ భారత్ విశ్వ విజేతగా నిలిచింది. ఈ క్రమంలో జట్టు పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత వరల్డ్ కప్ గెలుచుకోవడంతో స్టార్ ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్(Jemimah Rodrigues), టీమిండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ మధ్య సోషల్ మీడియా వేదికగా ఫన్నీ సంభాషణ జరుగుతుంది. తాజాగా జెమీమా చేసిన స్పెషల్ రిక్వెస్ట్ పై గవాస్కర్ స్పందించారు. దీనికి సంబంధించిన పూర్తి కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
మహిళల వన్డే ప్రపంచకప్ 2025 సెమీస్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పై భారత్ విజయం సాధించిన తరువాత సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) మాట్లాడుతూ .. అభిమానులకు ఓ వాగ్దానం చేశారు. భారత జట్టు ప్రపంచకప్ గెలిస్తే.. అప్పుడు సెమీస్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడిన జెమీమా రోడ్రిగ్స్(Jemimah Rodrigues) గిటారు వాయిస్తుంటే తాను పాట పాడుతానన్నాడు. అయితే.. ఇది జెమీమా ఒప్పుకుంటేనే జరుగుతుందన్నాడు. గవాస్కర్ కామెంట్స్ కూ జెమీమా సైతం స్పందించింది. తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సునీల్ గవాస్కర్‌కు ఒక సందేశాన్ని పంపారు. నమస్తే సునీల్ గవాస్కర్ సార్.. ఇండియా ప్రపంచ కప్‌ను గెలిస్తే, మనమిద్దరం కలిసి ఒక పాట పాడుతామని మీరు వాగ్దానం చేశారని గుర్తు చేసింది. తాను, తన గిటార్‌తో సిద్ధంగా ఉన్నాను, మీరు కూడా మీ మైక్‌తో సిద్ధంగా ఉంటారని ఆశిస్తున్నానని జెమీమా ఇన్ స్టాలో పేర్కొన్నారు.
జెమీమా రిక్వెస్ట్ పై తాజాగా గవాస్కర్(Sunil Gavaskar) స్పందించాడు. ఓ వీడియోను రిలీజ్ చేస్తూ పలు విషయాలను ప్రస్తావించాడు. 'హాయ్ జెమీమా. ముందుగా, ఐసిసి మహిళల ప్రపంచ కప్ గెలిచినందుకు మీకు, మీ బృందానికి అభినందనలు. కప్ గెలవడం అనే ఒక అద్భుతమైన క్షణం. మీరు భారత క్రికెట్ సమాజానికి, ఇండియన్ క్రికెట్ ఫ్యాన్సుకు ఎంతో సంతోషాన్ని ఇచ్చారు. మీకు ఎంత కృతజ్ఞతలు చెప్పిన తక్కువే' అని గవాస్కర్ వీడియో(viral cricket video)లో అన్నారు.
ఇదే సమయంలో జెమీమాకు ఇచ్చిన వాగ్ధానం గురించి కూడా ప్రస్తావంచాడు. 'మీరు మీ ముగింపును ఎంతో అందంగా నిలబెట్టారు. నేను, నా వాగ్ధానం నిలబెట్టుకునే సమయం వచ్చింది. దీనిని 'జెమ్' సెషన్ గా చేద్దాం!' అని గవాస్కర్ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. 2024లో జరిగిన బీసీసీఐ అవార్డుల కార్యక్రమంలోనూ, జెమిమా గిటార్(Jemimah guitar) వాయించగా, గావస్కర్ ప్రముఖ పాట 'క్యా హువా తేరా వాదా'ను ఆలపించిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
రవూఫ్‌పై రెండు మ్యాచ్‌ల నిషేధం
మరిన్ని స్పోర్ట్స్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి