Sunil Gavaskar: 1983 ప్రపంచ కప్‌తో పోల్చకండి: సునీల్ గావస్కర్
ABN , Publish Date - Nov 05 , 2025 | 12:56 PM
47 ఏళ్ల తర్వాత టీమిండియా మహిళలు వన్డే ప్రపంచ కప్‌ను అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ గెలుపును 1983లో భారత పురుషుల జట్టు ప్రపంచ కప్ విజేతగా నిలిచిన సందర్భంతో పోల్చడం మొదలుపెట్టారు. దీనిపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: 47 ఏళ్ల తర్వాత టీమిండియా మహిళలు వన్డే ప్రపంచ కప్‌ను అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ గెలుపును 1983లో భారత పురుషుల జట్టు ప్రపంచ కప్ విజేతగా నిలిచిన సందర్భంతో పోల్చడం మొదలుపెట్టారు. దీనిపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ స్పందించాడు.
‘భారత పురుషుల జట్టు 1983లో ప్రపంచ కప్(1983 World Cup) విజేతగా నిలిచింది. మహిళల జట్టు ఇప్పుడు ట్రోఫీ(Women’s World Cup 2025)ని అందుకుంది. దీంతో ఈ రెండింటినీ పోల్చడం మొదలు పెట్టారు. అలా చేయనవసరం లేదు. మహిళల జట్టుతో పోలిస్తే పురుషుల టీం ఒక్కసారి కూడా నాకౌట్‌కు చేరుకోలేదు. కానీ మన అమ్మాయిలు మాత్రం ఈ విక్టరీకి ముందే రెండుసార్లు ఫైనల్‌కు చేరుకున్నారు. అద్భుత ప్రదర్శనలు చేసిన రికార్డు కూడా ఉంది. పురుషుల క్రికెట్‌కు 1983 ప్రపంచ కప్ ఊపిరి పోసిన మాట వాస్తవం. అప్పటి నుంచి ప్రపంచమంతా భారత్ గురించి మాట్లాడుకోవడం ప్రారంభించారు. చాలా మంది పిల్లలు క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నారు. ఐపీఎల్ వచ్చాక క్రికెట్ ఆర్ధికంగానూ ఉన్నతస్థాయికి చేరింది. క్రికెటర్లు కేవలం సిటీల్లోంచే కాదు గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా రావడం మొదలుపెట్టారు. ఇప్పుడు మహిళల వన్డే ప్రపంచ కప్‌ను టీమిండియా నెగ్గడంతో.. ఎప్పటి నుంచో మహిళా క్రికెట్‌ను ప్రారంభించి ఆధిపత్యం ప్రదర్శిస్తోన్న దేశాలు కదిలి వస్తాయి’ అని గావస్కర్(Sunil Gavaskar) వ్యాఖ్యానించాడు.
ఆ తర్వాత..
భారత మహిళల జట్టు 2005, 2017 వన్డే ప్రపంచ కప్ ఫైనల్స్‌లో ఆడింది. అయితే కొద్దిలో ఛాంపియన్‌గా నిలిచే అవకాశాన్ని చేజార్చుకుంది. ఇప్పుడు మాత్రం చివరి వరకూ పట్టు విడవకుండా ఆడటంతో విజేతగా నిలిచింది. మరోవైపు పురుషుల జట్టు కూడా 1983లో ప్రపంచ కప్ గెలిచింది. ఆ తర్వాత 2003లో ఫైనల్‌కు చేరినా.. ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైంది. మళ్లీ 2011లో ధోనీ నాయకత్వంలో ఛాంపియన్ అయింది. రోహిత్ శర్మ సారథ్యంలో 2023లోనూ ఫైనల్‌కు వెళ్లినా గెలవలేకపోయింది.
ఈ వార్తలు కూడా చదవండి..
రవూఫ్‌పై రెండు మ్యాచ్‌ల నిషేధం
మరిన్ని స్పోర్ట్స్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి