Share News

Amanjot Kaur: మా నానమ్మకి ఏం కాలేదు: అమన్‌జోత్

ABN , Publish Date - Nov 05 , 2025 | 12:04 PM

మహిళల ప్రపంచ కప్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించిన అమన్‌జోత్ తన నానమ్మ ఆరోగ్యంపై వస్తున్న వార్తలను ఖండించింది. ఆమె బాగానే ఉన్నారని, అవాస్తవ ప్రచారాలను నమ్మొద్దని స్పష్టం చేసింది.

Amanjot Kaur: మా నానమ్మకి ఏం కాలేదు: అమన్‌జోత్
Amanjot Kaur

ఇంటర్నెట్ డెస్క్: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్‌ను టీమిండియా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. దీంట్లో అమన్‌జోత్ పట్టిన క్యాచ్ ఆట గతిని మార్చేసింది. అద్భుత ఫామ్‌లో ఉన్న సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్ ఇచ్చిన క్యాచ్ బౌండరీ లైన్ దగ్గర అమన్ అద్భుతంగా అందుకుంది. చరిత్రలో నిలిచిపోయే ఈ క్యాచ్‌తో 47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడేలా భారత్‌ను తొలిసారి ఛాంపియన్‌గా నిలిపింది. మ్యాచ్ అనంతరం ఆమె తండ్రి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిపై అమన్‌జోత్ క్లారిటీ ఇచ్చింది.


అమన్ తండ్రి ఏమన్నాడంటే?

‘అమన్‌జోత్(Amanjot Kaur) కెరీర్ వెనక మా అమ్మ భగవంతి మూలస్తంభంలా నిలబడింది. మొహాలీలో అమన్ వీధుల్లో క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పుడు ఆమెనే తీసుకెళ్లేది. బలోంగిలో నాకు కార్పెంటరీ షాప్ ఉంది. అమన్‌తో వెళ్లేందుకు నాకు వీలయ్యేది కాదు. కానీ ఇంటి ముందు, పార్క్ వద్ద అమన్ మగపిల్లలతో ఆడేటప్పుడు బయట కూర్చొని చూస్తూ ఉండేది. చాలామంది అమ్మాయిలూ ధైర్యంగా వారితో ఆడేవారు. ప్రపంచ కప్ సమయంలో మా అమ్మకు గుండెపోటు వచ్చింది. అయితే ఆ విషయాన్ని అమన్‌కు చెప్పలేదు. ఆమె దృష్టి మారకుండా ఉండాలనే అలా చేశాం’ అని అమన్ తండ్రి భూపిందర్ సింగ్ తెలిపారు.


అవన్నీ నమ్మొద్దు..

తన నానమ్మ విషయంలో తండ్రి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో భిన్నంగా ప్రచారం అవ్వడంపై అమన్ స్పందించింది. ‘మా నానమ్మ విషయంలో ఓ క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నా. ఆమె ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారు. బయట ప్రచారం అవుతున్నట్లు ఎలాంటి సమస్యా లేదు. ఇలాంటి వాస్తవాలు నమ్మొద్దు. ప్రచారం చేయొద్దు. మా కుటుంబంపై ప్రేమాభిమానాలు చూపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని అమన్ వెల్లడించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

హ్యాపీ బర్త్‌డే విరాట్!

రవూఫ్‌పై రెండు మ్యాచ్‌ల నిషేధం

మరిన్ని స్పోర్ట్స్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 05 , 2025 | 12:04 PM