Share News

Bumrah Creates History: విండీస్ తో టెస్టు...చరిత్ర సృష్టించిన జస్‌ప్రీత్ బుమ్రా

ABN , Publish Date - Oct 11 , 2025 | 10:43 AM

శుక్రవారం వెస్టిండీస్‌తో ఢిల్లీ వేదికగా ప్రారంభమైన రెండో టెస్ట్‌తో బుమ్రా ఓ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు సృష్టించాడు. అంతేకాక 93 ఏళ్లలో ఒక్కే ఒక్కడి బుమ్రా నిలిచాడు.

 Bumrah Creates History: విండీస్ తో టెస్టు...చరిత్ర సృష్టించిన జస్‌ప్రీత్ బుమ్రా
Jasprit Bumrah

ఢిల్లీ వేదికగా ఇండియా , వెస్టిండీస్ ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో భారత్ బ్యాటింగ్ లో అదరగొడుతుంది. జైస్వాల్, సాయి సుదర్శన్ అదిరిపోయే ప్రదర్శన్ ఇవ్వడంతో తొలి రోజు ఇండియా భారీ స్కోర్ చేసింది. ప్రస్తుతం క్రీజులో జైస్వాల్, కెప్టెన్ శుభ్ మన్ గిల్ ఉన్నారు. ఇది ఇలా ఉంటే..ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) అరుదైన రికార్డు సృష్టించాడు. అంతేకాక 93 ఏళ్లలో ఒక్కే ఒక్కడి బుమ్రా నిలిచాడు. మరి.. ఆయన సృష్టించిన రికార్డు ఏమిటి.. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..


శుక్రవారం వెస్టిండీస్‌తో(India vs West Indies Test) ఢిల్లీ వేదికగా ప్రారంభమైన రెండో టెస్ట్‌తో బుమ్రా(Jasprit Bumrah) ఓ ఫీట్ సాధించాడు. 93 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రలోనే మూడు ఫార్మాట్లలో 50 మ్యాచ్‌లు ఆడిన ఏకైక ఇండియన్ పేసర్‌గా నిలిచాడు. వెస్టిండీస్ తో జరిగే రెండో టెస్టు బుమ్రాకు 50వ టెస్ట్ మ్యాచ్. బుమ్రా ఇప్పటి వరకు 75 టీ20లు, 89 వన్డేలు, 50 టెస్ట్‌లు ఆడాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన ఏడో టీమిండియా ప్లేయర్ గా బుమ్రా నిలిచాడు.


మూడు ఫార్మాట్లలో 50 మ్యాచ్‌లు ఆడిన భారత ఆటగాళ్ల జాబితాలో బుమ్రా కన్న ముందు మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ, కింగ్ విరాట్ కోహ్లీ(Kohli), రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కేఎల్ రాహుల్‌లు ఉన్నారు. టెస్ట్‌లో ఏడుగురు భారత పేసర్లు మాత్రమే 50 ప్లస్ టెస్ట్ మ్యాచ్‌లు ఆడారు. ఈ జాబితాలో 131 మ్యాచ్‌లతో కపిల్ దేవ్ టాప్ ప్లేస్ లో ఉన్నారు. ఆయన తర్వాత ఇషాంత్ శర్మ(105), జహీర్ ఖాన్(92), మహమ్మద్ షమీ(64), జవగళ్ శ్రీనాధ్(67), ఉమేశ్ యాదవ్(57), బుమ్రా(50) ఉన్నారు. ఇప్పటి వరకు బుమ్రా(Jasprit Bumrah) 93 టెస్ట్ ఇన్నింగ్స్‌ల్లో 222 వికెట్లు తీసాడు. ఇందులో 15 సార్లు ఐదు వికెట్ల సాధించాడు.



ఇవి కూడా చదవండి:

Shubman Gill: శుభ్‌మన్ గిల్‌కు బిగ్ రిలీఫ్.. తొలిసారి !

IPL 2026: CSK రిలీజ్ చేయనున్న ప్లేయర్లు వీరే!

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 11 , 2025 | 10:49 AM