Share News

IPL Mini Auction 2026: ఎవరి పర్సులో ఎంతుంది..?

ABN , Publish Date - Dec 16 , 2025 | 12:03 PM

ఐపీఎల్ 2026కి సంబంధించిన మినీ వేలం మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. అబుదాబీ వేదికగా వేలం ప్రక్రియ కొనసాగనుంది. ఏ ఫ్రాంచైజీ దగ్గర ఎంత పర్సు ఉందంటే..?

IPL Mini Auction 2026: ఎవరి పర్సులో ఎంతుంది..?
IPL 2026

ఇంటర్నెట్ డెస్క్: అబుదాబీ వేదికగా మంగళవారం మధ్యాహ్నం ఐపీఎల్ 2026(IPL 2026)కి సంబంధించి మినీ వేలం జరగనుంది. తమ జట్లలోకి నైపుణ్యమున్న ఆటగాళ్లను తీసుకోవడం కోసం ఫ్రాంచైజీలు పోటీ పడనున్నాయి. జట్ల అభ్యర్థనల మేరకు చివరి నిమిషంలో కొత్తగా 19 మంది ఆటగాళ్ల పేర్లు వేలం ప్రక్రియలో చేర్చారు. ఈ జాబితాలో అభిమన్యు ఈశ్వరన్ ఉన్నాడు. దీంతో ఈ వేలంలో పాల్గొనే ఆటగాళ్ల సంఖ్య 369కు చేరుకుంది.


కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) ఈ వేలంలో 13 మంది ఆటగాళ్లను తీసుకోనుంది. ఆ జట్టు అజింక్య రహానే, రింకూ సింగ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణాను రిటైన్ చేసుకుని.. ఆండ్రీ రస్సెల్, మొయిన్ అలీ, క్వింటన్ డికాక్, వెంకటేశ్ అయ్యర్‌ను రిలీజ్ చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ధోనీ, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబేను రిటైన్ చేసుకుంది. జడేజా, సామ్ కరన్‌ను రాజస్థాన్ రాయల్స్‌కు ఇచ్చి ట్రేడ్ ద్వారా సంజూ శాంసన్‌ను దక్కించుకుంది. మతీశా పతిరణ, డెవన్‌ కాన్వే, రచిన్‌ రవీంద్రను రీలీజ్‌ చేసింది. ముంబయి ఇండియన్స్‌ రోహిత్‌ శర్మ, హార్దిక్‌ పాండ్య, జస్‌ప్రీత్‌ బుమ్రా, సూర్యకుమార్‌ యాదవ్‌, ట్రెంట్‌ బోల్ట్‌, విల్‌జాక్స్‌ను రిటైన్‌ చేసుకుంది.


పది ఫ్రాంఛైజీల్లో రూ.2.75 కోట్ల పర్స్‌తో ముంబయి ఇండియన్స్‌ చివరిస్థానంలో ఉంది. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ వద్ద అత్యధికంగా రూ.64.30 కోట్లు ఉన్నాయి. రూ.43.40 కోట్లతో తర్వాతి స్థానంలో చెన్నై సూపర్‌కింగ్స్‌ ఉంది. ఏ ఫ్రాంచైజీ దగ్గర ఎంత పర్సు ఉందంటే..?


  • కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ - రూ.64.30 కోట్లు

  • చెన్నై సూపర్‌ కింగ్స్‌ - రూ.43.40 కోట్లు

  • సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ - రూ.25.50 కోట్లు

  • లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ - రూ.22.95 కోట్లు

  • ఢిల్లీ క్యాపిటల్స్‌ - రూ.21.80 కోట్లు

  • రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు - రూ.16.40 కోట్లు

  • రాజస్థాన్‌ రాయల్స్‌ - రూ.16.05 కోట్లు

  • గుజరాత్‌ టైటాన్స్‌ - రూ.12.90 కోట్లు

  • పంజాబ్‌ కింగ్స్‌- రూ.11.50 కోట్లు

  • ముంబై ఇండియన్స్‌- రూ.2.75 కోట్లు


ఇవి కూడా చదవండి:

వైభవ్ సూర్యవంశీని కట్టడి చేస్తాం: మలేసియా కెప్టెన్ డియాజ్

జట్టుకు సీఈవోలా ఫీలవ్వకూడదు.. గంభీర్‌కు హర్ష భోగ్లే హెచ్చరిక

Updated Date - Dec 16 , 2025 | 12:35 PM