Share News

Virat Kohli Duck Record: కోహ్లీ చెత్త రికార్డ్.. 13 ఏళ్లలో ఇదే తొలిసారి!

ABN , Publish Date - Oct 19 , 2025 | 02:30 PM

సుధీర్ఘ విరామం తర్వాత ఆసీస్ మ్యాచ్ తో టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తీవ్రంగా నిరాశపర్చాడు. తొలి మ్యాచ్‌లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన కోహ్లీ డకౌట్‌గా వెనుదిరిగాడు. 8 బంతులాడి కోహ్లీ మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో కూపర్ కొన్నోల్లీ స్టన్నింగ్ క్యాచ్‌కు పెవిలియన్ చేరాడు.

 Virat Kohli Duck Record:  కోహ్లీ చెత్త రికార్డ్.. 13 ఏళ్లలో ఇదే తొలిసారి!
Virat Kohli Duck Record

ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ నేడు(ఆదివారం) పెర్త్ లో జరుగుతోంది. సుధీర్ఘ విరామం తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తీవ్రంగా నిరాశపర్చాడు. తొలి మ్యాచ్‌లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన కోహ్లీ డకౌట్‌గా వెనుదిరిగాడు. 8 బంతులాడి కోహ్లీ మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో కూపర్ కొన్నోల్లీ స్టన్నింగ్ క్యాచ్‌కు పెవిలియన్ చేరాడు. 224 రోజుల తర్వాత భారత్ తరఫున బరిలోకి దిగిన కోహ్లీ ఖాతా ఏమి తెరవకుండానే ఔట్ కావడం అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది.


డకౌట్ కావడంతో కోహ్లీ(Virat Kohli Duck Record) ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అది కూడా 13 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమన్హారం. ఆస్ట్రేలియా(Australia) గడ్డపై వన్డేల్లో డకౌట్ కావడం ఇదే తొలిసారి. 2012 ఫిబ్రవరి 5న మెల్‌బోర్న్ వేదికగా తొలి వన్డే ఆడిన కోహ్లీ.. ఇప్పటి వరకు 30 వన్డేలు ఆడాడు. అయితే ఏ మ్యాచ్ లోనూ పరుగులు చేయకుండా ఔట్ కాలేదు. కానీ తాజా ఇన్నింగ్స్‌లోనే కోహ్లీ పరుగులు చేయకుండా వెనుదిరిగాడు.


నేడు(ఆదివారం) పెర్త్‌లో జరిగిన మ్యాచ్ లో మొత్తంగా కోహ్లీకి ఇది 39వ డకౌట్. మూడు ఫార్మాట్లలో కలిసి 551 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 39 సార్లు పరుగుల ఖాతా తెరవకుండా పెవిలియన్ చేరాడు. ఈ జాబితాలో జహీర్ ఖాన్(44), ఇషాంత్ శర్మ(40) కోహ్లీ కన్నా ముందు ఉన్నారు.వన్డేల్లో కోహ్లీకి ఇది 17వ డక్‌ కాగా.. ఈ లిస్ట్ లో సౌరవ్ గంగూలీ, రోహిత్ శర్మలను కోహ్లీ(Kohil) అధిగమించాడు. గంగూలీ, రోహిత్(Rohit) వన్డేల్లో చెరో 16 సార్లు డకౌట్ అయ్యారు. వన్డేల్లో అత్యధిక సార్లు డకౌట్ అయిన భారత ఆటగాడిగా సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar)(463 వన్డేల్లో 20 సార్లు) కొనసాగుతున్నాడు.అతని తర్వాత జవగళ్ శ్రీనాథ్(19), అనిల్ కుంబ్లే(18), యువరాజ్ సింగ్(18), హర్భజన్ సింగ్(17), కోహ్లీ(17) కొనసాగుతున్నారు.


ఇవి కూడా చదవండి..

ఆస్ట్రేలియా పర్యటనకు మంత్రి లోకేష్.. ఎన్ని రోజులంటే

ఉద్యోగ సంఘాలతో సర్కార్ కీలక చర్చలు

Updated Date - Oct 19 , 2025 | 08:33 PM