కురుల సిరులు... ఆ పొడవాటి జడ చూసి..
ABN , Publish Date - Oct 19 , 2025 | 02:11 PM
‘ఓ వాలు జడా...’ అంటూ మన బాపు బొమ్మ మురిసిపోవచ్చుగాక... ఆ పొడవాటి జడ చూసి మిగతావారు అసూయపడొచ్చుగాక. అయితే పొడవాటి కురుల సిరులు అతివలందరికీ సాధ్యం కాదనేది నిజం. చైనాలోని హ్వాంగ్లో గ్రామంలో నివసించే ‘రెడ్ యాయో’ స్త్రీల జుట్టు పొడవు రెండు మీటర్లదాకా ఉంటుంది.
‘ఓ వాలు జడా...’ అంటూ మన బాపు బొమ్మ మురిసిపోవచ్చుగాక... ఆ పొడవాటి జడ చూసి మిగతావారు అసూయపడొచ్చుగాక. అయితే పొడవాటి కురుల సిరులు అతివలందరికీ సాధ్యం కాదనేది నిజం. చైనాలోని హ్వాంగ్లో గ్రామంలో నివసించే ‘రెడ్ యాయో’ స్త్రీల జుట్టు పొడవు రెండు మీటర్లదాకా ఉంటుంది. హ్వాంగ్లో ఓ ప్రాచీన గ్రామం. జనాభా 35 వేలకు మించదు. కొండల మధ్యన ఉండే ఆ గ్రామం గురించి 80ల దాకా అంతగా తెలియదు. కాస్త వెలుగులోకి వచ్చాక... అక్కడి స్త్రీల పొడవాటి కురులు, వారి రంగురంగుల దుస్తుల గురించి కథలు కథలుగా చెప్పుకోవడం ఆరంభమైౖంది.

‘లాంగ్ హెయిర్ విలేజ్’గా గిన్నిస్‌లోనూ చోటూ దక్కించుకుంది. ఊరంతా పొడవాటి జుట్టు ఎందుకంటే... జన్యువులు, అక్కడి వాతావరణం, మహిళలు తయారుచేసుకునే బియ్యపు నీటి షాంపూలే కారణమని తేలింది. పెళ్లైన మహిళలు తమ కురులను తలపాగాలాగా చుట్టి నల్లని గుడ్డతో కప్పుకుంటారు. ఈ విశేష గ్రామాన్ని చూసేందుకు ఈమధ్య పర్యాటకులూ హ్వాంగ్లోకు క్యూ కడుతున్నారండోయ్...