IND VS WI 2nd Test: భారత్ స్కోరు 518/5 డిక్లేర్డ్
ABN , Publish Date - Oct 11 , 2025 | 02:36 PM
ఢిల్లీ వేదికగా వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ డిక్లేర్డ్ ఇచ్చింది. యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్(175), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (129*: 196 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలతో భారత్ భారీ స్కోర్ చేసింది.
IND VS WI 2nd Test: ఢిల్లీ వేదికగా వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ డిక్లేర్డ్ ఇచ్చింది. యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్(175), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (129*: 196 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలతో భారత్ భారీ స్కోర్ చేసింది. మిగతా బ్యాటర్లూ కూడా రాణించడంతో రెండో రోజు రెండో సెషన్‌లోపే భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను 518/5 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. సాయిసుదర్శన్ (87), కేఎల్ రాహుల్ (38), నితీశ్‌కుమార్‌రెడ్డి (43) రాణించారు. విండీస్ బౌలర్లలో వారికన్ 3, రోస్టన్ ఛేజ్ ఒక వికెట్ తీశారు.
రెండో రోజు ప్రారంభంలో కాస్త ఆచితూచి ఆడిన గిల్( Shubman Gill) క్రీజ్‌లో కుదురుకున్నాక వేగం పెంచాడు. తన ట్రేడ్ మార్క్ బ్యాటింగ్‌తో విండీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. లూజ్ బాల్స్‌ను బౌండరీకి తరలించిన గిల్.. మంచి బంతులను ఆచితూటి ఆడాడు.మరోవైపు ధ్రువ్ జురెల్ (44) కూడా దూకుడుగా ఆడి...స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. 44 పరుగుల వద్ద జురెల్ ఔట్ అయ్యాడు.
దీంతో వెంటనే తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేస్తూ గిల్( Shubman Gill) నిర్ణయం తీసుకున్నాడు. తాజాగా గిల్ చేసిన సెంచరీతో విరాట్ కోహ్లి(kohil) సరసన నిలిచాడు. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సెంచరీలు చేసిన సారథిగా కోహ్లితో గిల్ సమంగా నిలిచాడు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన గిల్ ఐదో సెంచరీ చేయడం గమనార్హం. విరాట్ 2017, 2018 సంవత్సరాల్లో ఐదేసి సెంచరీలు కొట్టాడు. ప్రస్తుతం విండీస్(West Indies) ఒక వికెట్ కోల్పోయి 30 పరుగుల వద్ద కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి:
Shubman Gill: శుభ్‌మన్ గిల్‌కు బిగ్ రిలీఫ్.. తొలిసారి !
Jaiswal Missed Double Century: గిల్ తప్పిదం.. చేజారిన యశస్వి ద్విశతకం!
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి