Jaiswal Missed Double Century: గిల్ తప్పిదం.. చేజారిన యశస్వి ద్విశతకం!
ABN , Publish Date - Oct 11 , 2025 | 11:57 AM
కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చేసిన చిన్న తప్పిదంతోనే రనౌట్ గా జైశ్వాల్ 175 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. అలా ఎవ్వరూ ఊహించని విధంగా తృటిలో డబుల్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఇన్నింగ్స్‌లో 92వ ఓవర్‌ను జైదెన్ సీలెస్ బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్ రెండో బంతిని యశస్వి మిడాఫ్ వైపు కొట్టాడు..
ఢిల్లీ వేదికగా వెస్టిండీస్( West Indies)తో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆటలో అందరి కళ్లు యంగ్ బ్యాటర్ జైస్వాల్ పైనే ఉన్నాయి. కారణంగా 173 పరుగులతో క్రీజ్ లో ఉన్న జైస్వాల్ డబుల్ సెంచరీ చేస్తాడని, అది చూడాలని భావించారు. శనివారం ప్రారంభమైన రెండో రోజు ఆటలో కూడా జైస్వాల్ ఫుల్ జోష్ తో కనిపించాడు. ద్వి శతకం పక్కా అని అందరూ అనుకున్నారు. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా తృటిలో డబుల్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Shubman Gill) చేసిన చిన్న తప్పిదంతోనే రనౌట్ గా జైశ్వాల్ 175 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు.
శనివారం ప్రారంభమై రెండో రోజు ఆట తొలి ఇన్నింగ్స్‌లో 92వ ఓవర్‌ను జైదెన్ సీలెస్ బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్ రెండో బంతిని యశస్వి మిడాఫ్ వైపు కొట్టాడు. సులువుగానే పరుగు వస్తుందని అతడు పరిగెత్తడం ప్రారంభించాడు. నాన్‌స్ట్రైకింగ్‌లో ఉన్న గిల్ కూడా ఓకే అన్నట్లుగా ముందుకు వచ్చాడు. ఆ వెంటనే క్షణాల్లో వద్దంటూ వెనక్కి వెళ్లాడు. అప్పటికే సగం పిచ్‌కు పైగా జైశ్వాల్(Jaiswal)దాటాడు. రిటర్న్ అయ్యేలోగా వికెట్ కీపర్ జైస్వాల్ ను రనౌట్ చేశాడు. దీంతో వీరిద్దరి 74 పరుగుల భాగస్వామ్యానికి తెర పడింది. దీంతో శుభ్‌మన్ గిల్(Shubman Gill)పై యశస్వి తీవ్ర అసహనం వ్యక్తంచేశాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
డబుల్ సెంచరీ మిస్ కావడంతో జైస్వాల్ తీవ్ర అసహనంతో తలను చేతితో కొట్టుకుంటూ మైదానం వీడాడు. ఒకవేళ గిల్ వెళ్లి ఉంటే..నాన్ స్ట్రైకింగ్ వైపు జైస్వాల్ ఔట్ అయ్యేవాడు. లేదా క్రీజులోకి చేరుకునేవాడని, గిల్(Gill) తప్పిందం కారణంగానే జైస్వాల్ డబుల్ సెంచరీ మిస్సైందని పలువురు అభిప్రాయ పడుతున్నార. మరోవైపు గిల్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. యశస్వి ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన నితీశ్‌కుమార్ దూకుడుగా ఆడేస్తున్నాడు. ప్రస్తుతం భారత్(India) స్కోరు మూడు వికెట్ల నష్టానికి 400 పరుగులు దాటింది.