Kohli-Anushka: రిటైర్‌మెంట్ తర్వాత ఆధ్యాత్మిక గురువుతో కోహ్లీ.. ఈయన గురించి తెలుసా..
ABN , Publish Date - May 13 , 2025 | 03:26 PM
Anushka Sharma: రిటైర్‌మెంట్ అనంతరం విరాట్ కోహ్లీ దంపతులు ఓ ఆధ్యాత్మిక గురువును కలిశారు. దీంతో ఎవరా గురువు.. అని అంతా చర్చించుకుంటున్నారు. మరి.. ఆ గురువు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం..
టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. తన రిటైర్‌మెంట్ మీద సోమవారం ప్రకటన చేశాడు. 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన విరాట్.. ఇక మీదట వన్డేల్లో మాత్రమే కనిపించనున్నాడు. ఇప్పటికే టీ20ల నుంచి వైదొలిగిన అతడు.. ఐపీఎల్ రూపంలో ఏడాదికోసారి ఆ ఫార్మాట్‌లోనూ అలరించనున్నాడు. రిటైర్‌మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించిన తర్వాతి రోజే సతీమణి అనుష్క శర్మతో కలసి ఒక ఆధ్మాత్మిక కేంద్రాన్ని సందర్శించాడు కోహ్లీ. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బృందావన్ ధామ్‌కు వెళ్లారీ స్టార్ కపుల్. అక్కడ ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహారాజ్ ఆశీస్సులు తీసుకున్నారు. రిటైర్‌మెంట్ ప్రకటన తర్వాత పాల్గొన్న తొలి వ్యక్తిగత కార్యక్రమం కావడంతో అంతా దీని గురించి చర్చించుకుంటున్నారు. ఎవరీ ఆధ్యాత్మిక గురువు అంటూ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఎవరీ ప్రేమానంద్..
ప్రముఖ ఆధ్యాత్మిక గురువుల్లో ఒకరైన ప్రేమానంద్ మహారాజ్.. ధర్మం, భక్తి, ఆధ్యాత్మికత, జీవితం.. ఇలా క్లిష్టమైన అంశాలను ఎంతో సరళంగా, అందరికీ అర్థమయ్యేలా చెబుతుంటారు. ఎలా బతకాలి, సమస్యల్ని ఎలా అధిగమించాలో వివరిస్తుంటారు. భజనలు, ఉపన్యాసాలతో ఎంతో మంది భక్తులకు ఆయన చేరువయ్యారు. భక్తి, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు తమ సమస్యలకు పరిష్కారాల కోసం ప్రేమానంద్‌ను కలుస్తుంటారు. గత మూడ్నాలుగేళ్లుగా ఫామ్ లేమితో ఇబ్బంది పడిన కోహ్లీ పలుమార్లు ఈ గురువును కలిశాడు. టీ20 వరల్డ్ కప్-2024, చాంపియన్స్ ట్రోఫీ-2025కి ముందు కూడా ఆయన్ను కలసి ఆశీస్సులు తీసుకున్నాడు. కెరీర్, జీవితంలో తాను ఎదుర్కునే ఇబ్బందుల్ని ఆయనతో పంచుకొని వాటిని పరిష్కరించుకున్నాడు. అందుకే రిటైర్‌మెంట్ తర్వాత తొలుత ప్రేమానంద్‌ను కోహ్లీ కలిశాడని తెలుస్తోంది. విరాట్‌కు ఎప్పుడూ అండగా ఉంటూ, అతడికి ప్రేమానంద్ మహారాజ్ మార్గనిర్దేశనం చేస్తున్నారని నెటిజన్స్ అంటున్నారు.

ఇవీ చదవండి:
కెప్టెన్సీతో కెరీర్‌ను ముగించిన కోహ్లీ
గంభీర్ వల్లే కోహ్లీ రిటైర్‌మెంట్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి