Suryakumar Yadav: నేను రోహిత్‌లా కాదు.. ఆ పని అస్సలు చేయను: సూర్యకుమార్
ABN , Publish Date - Jan 25 , 2025 | 01:34 PM
IND vs ENG: టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరో చాలెంజ్‌కు రెడీ అవుతున్నాడు. ఇంగ్లండ్‌ను ఇంకోసారి చిత్తు చేసేందుకు సిద్ధమవుతున్నాడు. బట్లర్ సేన బెండు తీయాలని చూస్తున్నాడు.

భారత టీ20 జట్టును సమర్థంగా ముందుకు నడిపిస్తున్నాడు సూర్యకుమార్ యాదవ్. బ్యాటర్‌గా అతడి పెర్ఫార్మెన్స్ కాస్త అటూ ఇటూ ఉన్నా.. సారథిగా మాత్రం 100కి 100 మార్కులు వేయించుకుంటున్నాడు. యంగ్ ప్లేయర్లపై నమ్మకం ఉంచి వరుసగా అవకాశాలు ఇవ్వడం, ఫెయిలైనా వారిని ప్రోత్సహించడం, మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్లు ఎప్పటికప్పుడూ సరికొత్త వ్యూహాలను పన్నుతూ టీమిండియాను విజయాల బాటలో పరుగులు పెట్టిస్తున్నాడు. రోహిత్ శర్మ నుంచి తీసుకున్న పగ్గాలకు పూర్తి న్యాయం చేస్తున్నాడు. అలాంటోడు తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హిట్‌మ్యాన్‌తో తనకు పోలిక వద్దన్నాడు.
రోహిత్‌కే సాధ్యం!
సారథ్యంలో రోహిత్ తనకు స్ఫూర్తి అని చెప్పాడు సూర్యకుమార్. అతడి దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని అన్నాడు. అయితే ఒక అంశంలో మాత్రం తామిద్దరం డిఫరెంట్ అన్నాడు. రోహిత్‌తో తనను పోల్చొద్దన్నాడు. ‘స్టంప్స్‌కు నేను ఎప్పుడూ దూరంగా ఉంటా. ఎవరు ఎందులో స్పెషలో వాళ్లు అందులోనే ఉంటే బెటర్. ఆ ప్రత్యేకత అనేది వాళ్లతో ఉంటేనే మంచిది’ అని సూర్య చెప్పుకొచ్చాడు. మిస్టర్ 360 ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక సాలిడ్ రీజన్ ఉంది. రోహిత్ శర్మ కెప్టెన్సీ చేస్తున్నప్పుడు స్టంప్ మైక్ ఆడియోలు, వీడియోలు బాగా వైరల్ అవుతుంటాయి.
నా వల్ల కాదు!
ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు ఔట్ అయినప్పుడు, ఫీల్డర్లు క్యాచ్‌లు నేలపాలు చేసినప్పుడు, ఎల్బీడబ్ల్యూలు అప్పీల్స్ సమయంలో రోహిత్ ఏదో ఒక కామెంట్ చేయడం పరిపాటి. చాలా టైమ్స్ అతడు చేసిన ఫన్నీ కామెంట్స్ ఆడియో క్లిప్‌లు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఇతర ఆటగాళ్లపై అతడు సీరియస్ అవ్వడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశంపై సూర్యకుమార్ పైవిధంగా స్పందించాడు. తాను అలాంటోడ్ని కాదన్నాడు. స్టంప్ మైక్ అంశంలో రోహిత్‌కు తాను పోటీ ఇవ్వలేనని.. కామెంట్స్ చేయడం లాంటివి తన వల్ల కాదన్నాడు మిస్టర్ 360. స్టంప్ మైక్‌కు దూరంగా ఉంటూ గ్రౌండ్‌లో సారథిగా తాను ఏం చేయాలో అది చేసుకుపోతానని సూర్య స్పష్టం చేశాడు.
ఇవీ చదవండి:
రెండో టీ20కి ముందు భారత్‌కు బిగ్ షాక్
ఖేలో ఇండియా గేమ్స్‌లో నయనకు స్వర్ణం
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి