SRH vs PBKS Playing 11: కమిన్స్ వర్సెస్ అయ్యర్.. ఎవ్వరూ తగ్గట్లే..
ABN , Publish Date - Apr 12 , 2025 | 05:18 PM
Today IPL Match: సన్‌రైజర్స్ హైదరాబాద్ చావోరేవో తేల్చుకునేందుకు రెడీ అవుతోంది. ప్లేఆఫ్స్ రేసులో ఉండాలంటే తప్పక నెగ్గాల్సిన పరిస్థితుల్లో ఇవాళ పంజాబ్ కింగ్స్‌ను మట్టికరిపించాలనే పట్టుదలతో ఉంది ఆరెంజ్ ఆర్మీ. ఈ నేపథ్యంలో రెండు జట్ల ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్-2025లో ఇవాళ భీకర సమరం జరగనుంది. గతేడాది రన్నరప్ సన్‌రైజర్స్‌కు ఈ సీజన్‌లో వరుస విజయాలతో హోరెత్తిస్తున్న పంజాబ్ కింగ్స్‌కు మధ్య ఉప్పల్‌లో బిగ్ వార్ జరగనుంది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో కమిన్స్ సేన ఏం చేస్తుందో చూడాలని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అటు పాయింట్స్ టేబుల్‌లో టాప్ బెర్త్‌పై కన్నేసిన పంజాబ్ కింగ్స్.. తెలుగు జట్టును సొంతగడ్డపై ఓడించాలని పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో రెండు టీమ్స్ ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం..
పవర్‌తో కొట్టేలా..
వరుస ఓటములు ఎదురవుతున్నా సన్‌రైజర్స్ ప్లేయింగ్ ఎలెవన్ విషయంలో తగ్గేదేలే అని వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. పవర్‌హిట్టర్లతో పంజాబ్‌కు పిచ్చెక్కించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ అదే నిజమైతే.. హెడ్, అభిషేక్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తారు. ఇషాన్, నితీష్, క్లాసెస్ వరుసగా ఫస్ట్ డౌన్, సెకండ్ డౌన్, థర్డ్ డౌన్‌లో ఆడతారు. అనికేత్, కమిందు ఫినిషింగ్ రోల్ తీసుకుంటారు. హర్షల్, సిమర్జీత్, షమీతో కలసి కెప్టన్ కమిన్స్ పేస్ బాధ్యతలు పంచుకోవడం ఖాయం.
నో ఎక్స్‌పెరిమెంట్
పంజాబ్ జట్టులోనూ ఒకట్రెండు మార్పులు తప్పితే పెద్దగా చేంజెస్ చేసేలా కనిపించడం లేదు. ప్రియాన్ష్, ప్రభుసిమ్రన్ ఓపెనింగ్ చేస్తారు. ఆ తర్వాత అయ్యర్, నేహాల్, మాక్స్‌వెల్ బ్యాటింగ్‌కు దిగడం పక్కా. స్టొయినిస్, శశాంక్, యాన్సన్ ఫినిషింగ్ రోల్ తీసుకోవడం ఖాయం. అర్ష్‌దీప్, ఫెర్గూసన్ మెయిన్ పేసర్స్‌గా ఆడతారు. ప్రధాన స్పిన్నర్‌గా చాహల్ ఎలాగూ జట్టులో ఉంటాడు.
ప్రాబబుల్ ప్లేయింగ్ ఎలెవన్స్
సన్‌రైజర్స్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నీతీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అనికేత్ వర్మ, కమిందు మెండిస్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, సిమర్జీత్ సింగ్, మహ్మద్ షమీ.
ఇంపాక్ట్ ప్లేయర్: జీషన్ అన్సారీ.
పంజాబ్: ప్రియాన్ష్ ఆర్య, ప్రభుసిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నేహాల్ వధేరా, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టొయినిస్, శశాంక్ సింగ్, మార్కో యాన్సన్, అర్ష్‌దీప్ సింగ్, లాకీ ఫెర్గూసన్, యుజ్వేంద్ర చాహల్.
ఇంపాక్ట్ ప్లేయర్: యష్ ఠాకూర్.
ఇవీ చదవండి:
రోహిత్ అరుపులు.. ప్లేయర్ల పరుగులు..
జీటీకి షాక్.. తోపు ప్లేయర్ దూరం
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి