Share News

Rohit Sharma: రోహిత్ శర్మ అరుపులు.. ఆటగాళ్ల పరుగులు.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే

ABN , Publish Date - Apr 12 , 2025 | 02:24 PM

ఢిల్లీ చేరుకున్న ముంబై ఇండియన్స్ టీమ్ ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తోంది. కోచ్‌లు మహేలా జయవర్దనే, లసిత్ మలింగల సారథ్యంలో ఆటగాళ్లు సాధన చేస్తున్నారు. అయితే ముంబై ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఢిల్లీ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.

Rohit Sharma: రోహిత్ శర్మ అరుపులు.. ఆటగాళ్ల పరుగులు.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే
Rohit Sharma

వరుస పరాజయాలతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ (MI) జట్టు ఆదివారం జరగబోయే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో (MI vs DC) తలపడబోతోంది. ఢిల్లీలో ఈ మ్యాచ్ జరగబోతోంది. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న ముంబై ఇండియన్స్ టీమ్ ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తోంది. కోచ్‌లు మహేలా జయవర్దనే, లసిత్ మలింగల సారథ్యంలో ఆటగాళ్లు సాధన చేస్తున్నారు. అయితే ముంబై ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఢిల్లీ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దుమ్ముతో కూడిన ఈదురు గాలులు ఢిల్లీని చుట్టు ముట్టాయి (Dusty storms in Delhi).


ఈ దుమ్ము కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆ ప్రభావం ముంబై ఇండియన్స్ ఆటగాళ్ల ప్రాక్టీస్‌పై కూడా పడింది. ముంబై ఆటగాళ్లు స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తుండగా ఒక్కసారిగా దుమ్ము చుట్టు ముట్టింది. దానిని చూసిన రోహిత్ శర్మ (Rohit Sharma) ఆటగాళ్లను వెనక్కి వచ్చేయడంటూ కేకలు వేశాడు. దీంతో కోచ్‌లు, ఆటగాళ్లు పరిగెత్తుకుంటూ వెనక్కి వచ్చేశారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


రోహిత్ అరుస్తున్నప్పుడు పక్కనే ఓ వ్యక్తి వీడియో తీస్తూ కనిపించాడు. అతడిని రోహిత్.. నన్ను ఎందుకు వీడియో తీస్తున్నావు, అటువైపు రికార్డ్ చేయి అంటూ దుమ్ము వస్తున్న వైపు చూపించాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్ జట్టు కేవలం ఒక్క విజయాన్ని మాత్రమే నమోదు చేసింది.

ఇవి కూడా చదవండి..

IPL 2025: ఐపీఎల్ ఎవరు చూస్తారు.. పాకిస్తాన్ లీగ్‌నే అందరూ చూస్తారు.. పాక్ పేసర్ మాటలు వింటే నవ్వుకోవాల్సిందే


IPL 2025, KKR vs CSK: చెన్నైకు స్పిన్ ఉచ్చు.. కోల్‌కతా ముందు స్వల్ప టార్గెట్


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 12 , 2025 | 02:24 PM