SRH IPL 2025: సన్‌రైజర్స్ ఫెయిల్యూర్‌పై వెటోరి రియాక్షన్.. ఇలా అనేశాడేంటి..
ABN , Publish Date - May 06 , 2025 | 02:40 PM
Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ ఐపీఎల్ సీజన్లో దారుణంగా ఫెయిలైంది. వరుస పరాజయాలతో ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ తరుణంలో ఆ జట్టు హెడ్ కోచ్ డానియల్ వెటోరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంతకీ అతడేం అన్నాడంటే..

క్యాష్ రిచ్ లీగ్-2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కథ ముగిసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ రద్దవడంతో కమిన్స్ సేన ప్లేఆఫ్స్ అవకాశాలు మూసుకుపోయాయి. ఆడిన 11 మ్యాచుల్లో 7 ఓటములతో 7 పాయింట్లతో ఉన్న ఆరెంజ్ ఆర్మీ.. మరో 3 మ్యాచులు ఉండగానే ఇంటిదారి పట్టింది. నెక్స్ట్ ఆడాల్సిన మ్యాచులన్నీ టీమ్‌కు నామమాత్రం కానున్నాయి. గతేడాది రన్నరప్‌గా నిలవడమే గాక అటాకింగ్ గేమ్‌తో అందర్నీ భయపెట్టిన ఎస్ఆర్హెచ్.. ఇలా వరుస ఓటములతో టోర్నీ నుంచి బయటకు రావడం అభిమానుల్ని తీవ్ర నిరుత్సాహానికి గురిచేస్తోంది. ఈ తరుణంలో సన్‌రైజర్స్ హెడ్ కోచ్ డానియల్ వెటోరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడేం అన్నాడో ఇప్పుడు చూద్దాం..
ఆ మాట అనలేదు..
ప్రతి మ్యాచ్ అగ్రెసివ్‌గా ఆడాలని తాము అనుకోలేదన్నాడు వెటోరి. దూకుడుగానే ముందుకు వెళ్తామని తానెప్పుడూ చెప్పలేదన్నాడు. ఈ సీజన్లో ఏదీ తమకు కలసిరాలేదన్నాడు. ఉప్పల్ పిచ్‌లు తమకు సపోర్ట్ చేయలేదన్నాడు. గతేడాదిలా హైస్కోరింగ్ మ్యాచులు ఈసారి జరగలేదన్నాడు సన్‌రైజర్స్ కోచ్. ఆటగాళ్లంతా అగ్రెసివ్‌గా బరిలోకి దిగినా.. ఈ సీజన్లో ఆ రోజుకు ఏం కావాలో అది చేయలేకపోయారని పేర్కొన్నాడు వెటోరి. అదే సమయంలో ప్లేయర్ల పెర్ఫార్మెన్స్లో నిలకడ లోపించిందన్నాడు. మహ్మద్ షమీకి ఇది కఠినమైన సీజన్ అని.. అతడు తన బెస్ట్ ఇచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించాడని వెటోరి చెప్పుకొచ్చాడు. అయితే అతడి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో కొందరు నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు. ఇది ఎస్కేపిజం అంటూ దుయ్యబడుతున్నారు.
ఎస్కేపిజం ఎందుకు..
గెలుపోటములతో సంబంధం లేకుండా అటాకింగ్ అప్రోచ్‌తోనే ఆడతామని కెప్టెన్ కమిన్స్ సహా సన్‌రైజర్స్ ప్లేయర్లు, టీమ్ మేనేజ్మెంట్ చెప్పుకుంటూ వచ్చారని గుర్తుచేస్తున్నారు. బ్యాటర్లు, బౌలర్లు పూర్తిగా ఫ్లాప్ అయ్యారని.. కోచింగ్ స్టాఫ్ వైఫల్యం కూడా ఉందని, దీన్ని ఒప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజన్స్. స్ట్రాటజీలు సరిగ్గా వేయలేదని.. పలు వ్యూహాలు బాగానే ఉన్నా వాటిని అమలుపరచడంలో వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించిందని కామెంట్స్ చేస్తున్నారు. ఫెయిల్యూర్‌కు రీజన్స్ ఏంటో అందరికీ కనిపిస్తున్నాయని.. అలాంటప్పుడు వాటిని ఒప్పుకొని ముందుకెళ్లకుండా ఎస్కేపిజం అవసరమా అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.
ఇవీ చదవండి:
వాళ్ల వల్లే ఈ స్థాయిలో ఉన్నా: కోహ్లీ
చరణ్‌ను కాపీ కొట్టిన డీసీ బ్యాటర్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి