SRH vs GT: ఎస్‌ఆర్‌హెచ్ ఓటమికి హెచ్‌సీఏ కారణమా.. ఎందుకిలా చేశారు..
ABN , Publish Date - Apr 07 , 2025 | 11:20 AM
Indian Premier League: సన్‌రైజర్స్ హైదరాబాద్ పరాజయాల పరంపర ఆగడం లేదు. మ్యాచ్ మ్యాచ్‌కూ ఆరెంజ్ ఆర్మీ ఆట తీసికట్టుగా మారుతోంది. వరుసగా నాలుగో ఓటమితో ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది కమిన్స్ సేన.

హోమ్ గ్రౌండ్‌లో మరో ఓటమిని చవిచూసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఐపీఎల్ నయా ఎడిషన్‌లో ఫేవరెట్స్‌లో ఒకటిగా బరిలోకి దిగిన కమిన్స్ సేన.. తొలి మ్యాచ్‌లో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఆ తర్వాత నుంచి ప్లానింగ్ సరిగ్గా లేకపోవడం, ఆటగాళ్లు ప్రెజర్‌లోకి వెళ్లిపోవడంతో వరుసగా 4వ ఓటమిని చవిచూసింది. ఉప్పల్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన సండే ఫైట్‌లో ఓడిన కమిన్స్ సేన.. ప్లేఆఫ్స్ చాన్సుల్ని మరింత సంక్లిష్టం చేసుకుంది. దీంతో ఎస్ఆర్‌హెచ్ ఫెయిల్యూర్‌పై అనేక విమర్శలు వస్తున్నాయి. ఇదే క్రమంలో టీమ్ ఓటమికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కారణమనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో వ్యక్తం అవుతున్నాయి. నెట్టింట ఈ కామెంట్స్ ఎందుకు వస్తున్నాయి.. అసలు నిజం ఏంటనేది ఇప్పుడు చూద్దాం..
ఎవరి వ్యూహం..
ఏ జట్టుకైనా హోమ్ గ్రౌండ్‌లో గెలవడం చాలా కంపల్సరీ. తమకు అలవాటైన కండీషన్స్‌లో ఎక్కువ మ్యాచుల్లో నెగ్గితే ప్లేఆఫ్స్ టెన్షన్ తగ్గుతుంది. బయట వేదికల్లో తక్కువ విజయాలు నమోదు చేసినా క్వాలిఫై అయిపోవచ్చు. అందుకే హోమ్ గ్రౌండ్‌ను అన్ని జట్లు అడ్డాగా చేసుకొని వ్యూహాలు సిద్ధం చేసుకుంటాయి. పిచ్‌లు కూడా తమకు సెట్ అయ్యేలా తయారు చేయించుకుంటాయి. అయితే ఇదే విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి సన్‌రైజర్స్‌కు మద్దతు దొరకలేదా అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. నిన్న గుజరాత్-ఎస్‌ఆర్‌హెచ్ పోరులో బ్లాక్ సాయిల్ పిచ్‌ను తయారు చేశారు. ఇలాంటి వికెట్‌పై పరుగులు చేయడం అంత ఈజీ కాదు.
ఎందుకిలా చేశారు..
సాధారణంగా ఉప్పల్ మైదానంలో బ్యాటింగ్ పిచ్‌ను ఎక్కువగా రూపొందిస్తారు. అందుకే ఇక్కడ 250 ప్లస్ స్కోర్లు నమోదవడం చూస్తుంటాం. అయితే నిన్న మాత్రం బ్లాక్ సాయిల్ పిచ్ డిజైన్ చేయడంతో సన్‌రైజర్స్ బ్యాటర్లు పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడ్డారు. గుజరాత్‌కు కూడా చేజింగ్ అంత ఈజీ కాలేదు. ఇంకో ఒకట్రెండు వికెట్లు పడి ఉంటే రిజల్ట్ తారుమారయ్యే చాన్స్ ఉండేది. అయితే ఇలాంటి పిచ్‌లు జీటీకి కొట్టినపిండి అనే చెప్పాలి. ఆ జట్టు హోమ్ గ్రౌండ్ అహ్మదాబాద్‌లో దాదాపుగా ఇలాంటి స్లో వికెట్, సేమ్ కండీషన్స్‌లో ఆడుతూ అలవాటు పడటంతో ప్రతికూల పరిస్థితి ఎదురైనా సన్‌రైజర్స్‌ను ఓడించింది జీటీ. దీంతో అసలు ఇలాంటి వికెట్‌ను ఎందుకు తయారు చేశారనే క్వశ్చన్స్ తలెత్తుతున్నాయి.
తప్పు ఎవరిది..
సన్‌రైజర్స్ బలం బ్యాటింగ్. కాబట్టి ఈజీగా రన్స్ చేసేందుకు వీలుగా ఫ్లాట్ వికెట్ తయారు చేసినట్లయితే జట్టుకు అనుకూలంగా ఉండేది. కానీ అలా జరగలేదు. దీంతో పిచ్ క్యూరేటర్ లేదా హెచ్‌సీఏ పెద్దలు ఎస్‌ఆర్‌హెచ్‌కు సహకరించలేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదే టైమ్‌లో మ్యాచ్ పాస్‌ల విషయంలో అసోసియేషన్‌తో గొడవ నేపథ్యంలో తమకు ఫలానా పిచ్ కావాలని హెచ్‌సీఏను సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ రిక్వెస్ట్ చేసిందా.. లేదా.. అనేది కూడా క్లారిటీ లేదు. దీనిపై ఉభయ వర్గాల నుంచి ఏదైనా క్లారిటీ వస్తే గానీ ఏదీ చెప్పలేం. ఏదేమైనా టీమ్ ఖాతాలో మరో ఓటమి చేరింది. ప్లేఆఫ్స్ చాన్స్ మరింత సంక్లిష్టంగా మారిందనేది నిజం.
ఇవీ చదవండి:
సన్‌రైజర్స్‌కు ప్లేఆఫ్ చాన్స్ ఉందా..
రిటైర్మెంట్.. ఇప్పుడే కాదు..!
రోహిత్‌తో ఆటను ఆస్వాదిస్తా..: కోహ్లీ
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి