Team India: ప్రాక్టీస్ మొదలుపెట్టిన బ్యాటింగ్ పిచ్చోడు.. ఇక మనల్ని ఎవడ్రా ఆపేది
ABN , Publish Date - Jan 30 , 2025 | 07:29 PM
Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీకి టైమ్ దగ్గర పడుతోంది. దీంతో అన్ని జట్లు తమ ఆయుధాలను సానబెడుతున్నాయి. మెగా ట్రోఫీని ఎలాగైనా పట్టేయాలని చూస్తున్నాయి.

వన్డే ఫార్మాట్‌లో రెండో అతిపెద్ద టోర్నమెంట్ అయిన చాంపియన్స్ ట్రోఫీకి సమయం దగ్గర పడుతోంది. ఫిబ్రవరి నెలలో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనున్న చాంపియన్స్ ట్రోఫీ మ్యాచులు దాదాపుగా పొరుగు దేశంలోనే జరుగుతాయి. ఒక్క టీమిండియా మ్యాచులు మాత్రం దుబాయ్‌లో నిర్వహిస్తారు. ఈసారి మెగా కప్ మిస్ అవ్వొద్దని అన్ని జట్లు పంతంతో ఉన్నాయి. అందుకు తగ్గట్లే తమ అస్త్రాలకు పదును పెడుతున్నాయి. టోర్నీ ఆరంభానికి అన్ని విధాలా సన్నద్ధంగా ఉండాలని భావిస్తున్నాయి. ఈ తరుణంలో ఓ భారత బ్యాటింగ్ పిచ్చోడు ప్రాక్టీస్ మొదలుపెట్టడం ఆసక్తికరంగా మారింది. అతడు ఎవరో ఇప్పుడు చూద్దాం..
ఫుల్ ప్రిపరేషన్!
టీమిండియా యంగ్ బ్యాటర్, వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఆస్ట్రేలియా టూర్‌లో వరుస వైఫల్యాలతో అతడి మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో ఆ సిరీస్ ముగిసిన తర్వాత అతడు పెద్దగా రెస్ట్ తీసుకోలేదు. తక్కువ గ్యాప్‌లోనే సాధన మొదలుపెట్టాడు. ఫామ్, ఫిట్‌నెస్, టెక్నిక్ బెటర్‌మెంట్ కోసం రంజీల బాట పట్టాడు. అక్కడ అద్భుతమైన సెంచరీతో తిరిగి టచ్‌లోకి వచ్చాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిపోయిన గిల్.. ఇప్పుడు మొహాలీ గ్రౌండ్‌లో ప్రాక్టీస్ షురూ చేశాడు. ఫుల్ ప్రిపరేషన్ మోడ్‌లోకి వెళ్లిపోయాడతను.
కప్పు మనదే!
చాంపియన్స్ ట్రోఫీకి బీసీసీఐ ప్రకటించిన భారత జట్టులో రోహిత్‌ను సారథిగా, గిల్‌ను అతడి డిప్యూటీగా నియమించింది. వైస్ కెప్టెన్సీ పోస్ట్‌తో అతడి మీద అదనపు బాధ్యతలు ఉంచింది. బోర్డుతో పాటు అభిమానుల నమ్మకం నిలబెట్టుకోవాలని పట్టుదలతో ఉన్న గిల్.. గంటల కొద్దీ సాధన చేస్తున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్‌తో పాటు చాంపియన్స్ ట్రోఫీలో ఆకాశమే హద్దుగా చెలరేగాలని చూస్తున్నాడు. అతడు టచ్‌లోకి వస్తే పరుగుల వరద పారిస్తాడనేది తెలిసిందే. బిగ్ నాక్స్‌తో రిజల్ట్‌ను శాసిస్తాడు. అందుకే అతడి బ్యాటింగ్ ప్రాక్టీస్ వీడియో చూసిన నెటిజన్స్.. రాక్షసుడు మొదలుపెట్టేశాడు, రాసుకోండి.. ఇక కప్పు మనదే బిగిలు అని కామెంట్స్ చేస్తున్నారు.
ఇదీ చదవండి:
ఇంగ్లండ్‌తో నాలుగో టీ20.. భారత ప్లేయింగ్ 11లో మార్పులు.. వాళ్లు ఔట్
నాలుగో టీ20.. టీమిండియాకు సూపర్ న్యూస్.. మహాబలుడు వచ్చేస్తున్నాడు
కోహ్లీని భయపెట్టిన ఉపేంద్ర.. సొంతగడ్డపై అంతా చూస్తుండగానే..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి