Share News

RR vs MI IPL 2025: రాజస్థాన్‌తో ముంబై ఫైట్.. ఈ ఐదుగురి ఆట మిస్ అవ్వొద్దు

ABN , Publish Date - May 01 , 2025 | 05:58 PM

Today IPL Match: రాజస్థాన్‌తో కీలక పోరుకు సిద్ధమవుతోంది ముంబై ఇండియన్స్. ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకోవాలని తహతహలాడుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ్టి పోరులో బరిలోకి దిగుతున్న వారిలో ఎవరి ఆట తప్పకుండా చూడాలో ఇప్పుడు తెలుసుకుందాం..

RR vs MI IPL 2025: రాజస్థాన్‌తో ముంబై ఫైట్.. ఈ ఐదుగురి ఆట మిస్ అవ్వొద్దు
RR vs MI

రాజస్థాన్ రాయల్స్-ముంబై ఇండియన్స్ మధ్య ఇవాళ కీలక పోరు జరగనుంది. ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకోవాలని తహతహలాడుతున్న ఎంఐ ఈ మ్యాచ్‌లో నెగ్గడం కంపల్సరీ. ప్లేఆఫ్స్ బెర్త్‌ల కాంపిటీషన్ పెరుగుతూ పోతోంది కాబట్టి విజయమే లక్ష్యంగా ఆ టీమ్ బరిలోకి దిగుతోంది. అటు రాజస్థాన్ ఇందులో నెగ్గి పరువు దక్కించుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లలోని ఆటగాళ్లలో పక్కా చూడాల్సిన పెర్ఫార్మెన్స్‌లు ఏవి.. ఎవరెవరి ఆటను మిస్ అవ్వొద్దో ఇప్పుడు తెలుసుకుందాం..


రోహిత్ శర్మ

ఇవాళ్టి పోరులో హిట్‌మ్యాన్ ఆట చూడాల్సిందే. ఈ సీజన్ మొదట్లో వరుసగా విఫలమవుతూ వచ్చిన రోహిత్.. సెకండాఫ్‌లో పుంజుకున్నాడు. సీఎస్‌కేపై 76 పరుగులు, సన్‌రైజర్స్ మీద 70 పరుగుల విధ్వంసక ఇన్నింగ్స్‌లు ఆడాడు.

వైభవ్ సూర్యవంశీ

14 ఏళ్ల సూర్యవంశీ ఈ సీజన్‌లో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారాడు. తొలి మ్యాచ్ నుంచే రెచ్చిపోయి ఆడుతున్నాడీ లెఫ్టాండ్ బ్యాటర్. గుజరాత్‌తో మ్యాచ్‌లో 38 బంతుల్లో 101 పరుగుల సంచలన ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు.


జస్‌ప్రీత్ బుమ్రా

గాయం కారణంగా సీజన్ మొదట్లో చాలా మ్యాచులు మిస్ అయ్యాడు బుమ్రా. అయితే ఎప్పుడైతే బరిలోకి దిగాడో అప్పటి నుంచి రఫ్ఫాడిస్తున్నాడు. వికెట్ల మీద వికెట్లు తీస్తూ బ్యాటర్లకు పోయిస్తున్నాడు. లక్నోతో గత మ్యాచ్‌లో 4 వికెట్లతో చెలరేగాడు.

యశస్వి జైస్వాల్

రాజస్థాన్ ఓపెనర్ జైస్వాల్ మంచి టచ్‌లో కనిపిస్తున్నాడు. గత మ్యాచ్‌లో జీటీపై 40 బంతుల్లో 70 పరుగులతో సత్తా చాటాడు. ఇవాళ ముంబై బౌలర్లను కూడా అతడు టార్గెట్ చేసి బాదడం ఖాయంగా కనిపిస్తోంది.

రియాన్ పరాగ్

రాజస్థాన్ సారథి పరాగ్ కసి మీద ఉన్నాడు. కెప్టెన్సీ బాధ్యత ప్రెజర్‌తో సరిగ్గా రాణించలేకపోతున్నాడీ యంగ్ బ్యాటర్. అయితే గత మ్యాచ్‌లో 15 బంతుల్లో 32 పరుగులతో సత్తా చాటాడు. కాబట్టి ముంబై మీదా అదే జోరును కొనసాగించాలని చూస్తున్నాడు.


ఇవీ చదవండి:

నా టార్గెట్ అదే: రోహిత్

బీసీసీఐని ముంచేసిన రోబో

ధోనీని సీఎస్‌కే ఓనర్ ఎందుకు ఆపినట్లు..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 01 , 2025 | 05:58 PM