Rohit Sharma: టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌గా రోహిత్ శర్మ.. ఇదేం ట్విస్ట్ భయ్యా..
ABN , Publish Date - Jan 09 , 2025 | 04:38 PM
Rohit Sharma: టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌గా రోహిత్ శర్మను నియమించారు. చాంపియన్స్ ట్రోఫీ-2025 నుంచి కోచ్‌గా పగ్గాలు చేపట్టనున్నాడు రోహిత్. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. వరుసగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్‌ల్లో భారత్ ఓడిపోవడం, హిట్‌మ్యాన్ అటు సారథిగా, ఇటు బ్యాటర్‌గా అట్టర్ ఫ్లాప్ అవడంతో అతడిపై విమర్శల జడివాన కురుస్తోంది. రోహిత్ పనైపోయింది.. ఇక అతడ్ని టీమ్‌లో నుంచి తీసేయండనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. హిట్‌మ్యాన్ గౌరవప్రదంగా పక్కకు జరిగి.. కొత్తవారికి అవకాశాలు ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో రోహిత్‌ను టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌గా నియమించడం హాట్ టాపిక్‌గా మారింది. చాంపియన్స్ ట్రోఫీ-2025 నుంచి కోచ్‌గా పగ్గాలు చేపట్టాలని ఆదేశించారు. అసలు రోహిత్ ఫీల్డింగ్ కోచ్‌గా రావడం ఏంటి? అతడు రిటైర్మెంట్ కాలేదు.. అప్పుడే కోచింగ్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం ఏంటి? అనేదేగా మీ సందేహం. దాని గురించి ఇప్పుడు క్లారిటీగా తెలుసుకుందాం..
అప్పటినుంచి బాధ్యతలు!
దివ్యాంగుల చాంపియన్స్ ట్రోఫీ 2025కి త్వరలో తెరలేవనుంది. జనవరి 12 నుంచి ఈ మెగా టోర్నీ జరగనుంది. శ్రీలంకలోని కొలంబో వేదికగా ఈ టోర్నీలోని మ్యాచులను నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొనే భారత జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా రోహిత్ శర్మను నియమించారు. టీమిండియా కెప్టెన్ హిట్‌మ్యాన్.. ఈ రోహిత్ ఒకరు కాదు. ఫీల్డింగ్ కోచ్‌గా ఎంపికైన రోహిత్ కూడా గతంలో ప్రొఫెషనల్ క్రికెట్ ఆడటం గమనార్హం. 2019 నుంచి 2020 మధ్య అతడు భారత జట్టు తరఫున ఇంటర్నేషనల్ లెవల్‌లో అదరగొట్టాడు. అయితే గాయం కారణంగా అతడు క్రికెట్ ఆడటం మానేశాడు. ఆ తర్వాత సైడ్‌ఆర్మ్ స్పెషలిస్ట్‌గా, ఫీల్డింగ్ కోచ్‌గా కొత్త కెరీర్‌ను మొదలుపెట్టాడు.
ఇవీ చదవండి:
ఆసీస్‌కు షాక్.. చాంపియన్స్ ట్రోఫీ భారత్‌దే.. మనల్ని ఎవడ్రా ఆపేది..
బుమ్రా ఇంజ్యురీపై అప్‌డేట్.. చాంపియన్స్ ట్రోఫీలో ఆడతాడా..
నాకు అక్కర్లేదు.. డివోర్స్ రూమర్స్‌పై ధనశ్రీ ఇన్‌స్టా పోస్ట్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి