Rishabh Pant-Umpire: మాట వినని అంపైర్.. పంత్ ఏం చేశాడో తెలిస్తే షాక్!
ABN , Publish Date - Jun 22 , 2025 | 07:31 PM
ఎప్పుడూ కూల్‌గా ఉండే రిషబ్ పంత్ ఒక్కసారిగా సీరియస్ అయ్యాడు. అంపైర్‌తో గొడవకు దిగాడు భారత వైస్ కెప్టెన్. అసలేం జరిగింది.. పంత్ ఎందుకు సీరియస్ అయ్యాడో ఇప్పుడు చూద్దాం..
టీమిండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ మైదానంతో పాటు బయట కూడా ఒకేలా ఉంటాడు. నవ్వుతూ తనతో ఉన్నవారిని నవ్విస్తూ ఉంటాడు రిషబ్. మ్యాచ్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ అతడు సంయమనం కోల్పోకుండా నిబ్బరంగా ఉంటాడు. జోక్స్ వేస్తూ సహచరుల మీద ఉండే ఒత్తిడిని తొలగిస్తుంటాడు పంత్. అలాంటోడు ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక అంపైర్ మీదే సీరియస్ అయ్యాడు. లీడ్స్ టెస్ట్ మూడో రోజు ఆటలో పంత్‌కు అంపైర్‌కు మధ్య ఆసక్తికరమైన వార్ జరిగింది. తన మాట వినకపోవడంతో అంపైర్‌తో గొడవకు దిగాడు భారత వైస్ కెప్టెన్. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..
ఎంత కోరినా..
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ సమయంలో బంతిని మార్చాలని భారత పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ పలుమార్లు ఫీల్డ్ అంపైర్ క్రిస్ గఫానేను కోరారు. బంతి పాతగా మారడంతో చేంజ్ చేయాలని వైస్ కెప్టెన్ పంత్ కూడా రిక్వెస్ట్ చేశాడు. కానీ దీనికి అంపైర్ ఒప్పుకోలేదు. బంతిని చెక్ చేసిన క్రిస్ గఫానే.. సైజ్ మారకపోవడంతో కొత్త బంతి ఇచ్చేందుకు నిరాకరించాడు. దీంతో కోపం తట్టుకోలేకపోయిన పంత్.. అంపైర్ వైపు చూస్తూ బంతిని గట్టిగా కిందకు విసిరాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా, ఈ మ్యాచ్‌లో ప్రస్తుతం 6 వికెట్లకు 396 పరుగులతో ఉంది ఇంగ్లండ్. హ్యారీ బ్రూక్ (97 నాటౌట్) ఒక ఎండ్‌లో పాతుకుపోయాడు. అతడ్ని ఔట్ చేస్తే గానీ భారత్‌కు ఆధిక్యం దక్కే చాన్స్ లేదు. బ్రూక్ ఇంకొన్ని ఓవర్లు ఆడితే టీమిండియా స్కోరుకు మరింత చేరువగా వచ్చేస్తుంది ఆతిథ్య జట్టు. మరి.. భారత బౌలర్లు మ్యాజిక్ చేస్తారేమో చూడాలి.
ఇవీ చదవండి:
స్టోక్స్‌కు దిమ్మతిరిగేలా చేసిన సిరాజ్
నల్లరిబ్బన్లు ఎందుకు కట్టుకున్నారంటే..
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి