IND vs ENG: నల్లరిబ్బన్లతో బరిలోకి దిగిన ఇండో-ఇంగ్లండ్.. కారణం ఇదే!
ABN , Publish Date - Jun 22 , 2025 | 05:34 PM
లీడ్స్ టెస్ట్ రెండో రోజు ఆటలో భారత్-ఇంగ్లండ్ ఆటగాళ్లు నల్లరిబ్బన్లతో బరిలోకి దిగారు. మరి.. ఇరు జట్ల ప్లేయర్లు ఎందుకిలా చేశారో ఇప్పుడు చూద్దాం..
లీడ్స్ టెస్ట్ ఆసక్తికరంగా సాగుతోంది. తొలి రోజు బ్యాటింగ్‌లో రప్ఫాడించిన భారత్.. రెండో రోజు కూడా తన ఆధిపత్యం చలాయించేందుకు ప్రయత్నించింది. కానీ బెన్ డకెట్ (62), ఓలీ పోప్ (106) అదరగొట్టడంతో ఆతిథ్య జట్టు కాస్త పైచేయి సాధించింది. అయితే మూడో రోజు మాత్రం ఆధిపత్యం చేతులు మారుతూ వస్తోంది. ఇరు జట్లు నువ్వానేనా అంటూ పోరాడుతున్నాయి. ఒకవైపు ఇంగ్లండ్ బ్యాటర్లు వేగంగా పరుగులు చేస్తుంటే.. మరోవైపు అవకాశం దొరికినప్పుడల్లా వికెట్లు తీస్తూ పట్టు బిగించేందుకు ప్రయత్నిస్తున్నారు టీమిండియా బౌలర్లు. కాగా, డే-3 ఇరు టీమ్స్ ప్లేయర్లు చేతులకు నల్లరిబ్బన్లు కట్టుకొని బరిలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది. మరి.. వాళ్లు ఎందుకిలా చేశారో ఇప్పుడు చూద్దాం..
పేస్‌తో వణికించాడు..
ఇంగ్లండ్ వెటరన్ పేసర్ డేవిడ్ లారెన్స్ ఆదివారం కన్నుమూశాడు. నరాల వ్యాధితో బాధపడుతున్న 61 ఏళ్ల డేవిడ్ ఇవాళ చనిపోయాడు. దీంతో అతడికి నివాళిగా భారత్-ఇంగ్లండ్ క్రికెటర్లు చేతికి నల్లరిబ్బన్లు కట్టుకొని బరిలోకి దిగారు. రెండో రోజు ఆట మొదలవడానికి ముందు ఇరు జట్ల ఆటగాళ్లు ఒకే వరుసలో నిలుచొని చప్పట్లతో సంఘీభావం తెలిపారు. క్రికెట్‌కు అతడు అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. కాగా, డేవిడ్ లారెన్స్ పేస్‌కు పెట్టింది పేరు. 80వ దశకంలో స్టన్నింగ్ బౌలింగ్‌తో బ్యాటర్లను భయపెట్టాడతను. 1988 నుంచి 1992 వరకు ఇంగ్లండ్‌కు ఆడిన ఈ బౌలర్.. జాతీయ జట్టుకు 5 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించాడు. మోకాలి గాయం కారణంగా అతడి కెరీర్ మధ్యలోనే ఆగిపోయింది. వర్ణ వివక్షతో పాటు కెరీర్‌లో ఎదుర్కొన్న ఇతర సమస్యలు, ఆరోగ్యం విషయంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి అతడు పలుమార్లు బహిరంగంగానే తన అభిప్రాయాలను పంచుకున్నాడు.

ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి