నాడు స్టుపిడ్ నేడు సూపర్బ్
ABN , Publish Date - Jun 22 , 2025 | 05:12 AM
‘అద్భుతం..అద్వితీయం’..ఇదీ భారత జట్టు వైస్-కెప్టెన్, కీపర్ రిషభ్ పంత్ సెంచరీ చేశాక దిగ్గజ ఆటగాడు, వ్యాఖ్యాత సునీల్ గవాస్కర్ స్పందన. ఇదే పంత్ కొద్ది నెలల కిందట ఆస్ట్రేలియాతో...
హెడింగ్లీ: ‘అద్భుతం..అద్వితీయం’..ఇదీ భారత జట్టు వైస్-కెప్టెన్, కీపర్ రిషభ్ పంత్ సెంచరీ చేశాక దిగ్గజ ఆటగాడు, వ్యాఖ్యాత సునీల్ గవాస్కర్ స్పందన. ఇదే పంత్ కొద్ది నెలల కిందట ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే (నాలుగో) టెస్ట్ మూడో రోజు ఆటలో పేసర్ బొలాండ్ బంతిని నిర్లక్ష్యంగా ఆడి వికెట్ పారేసుకున్నప్పుడు గవాస్కర్ తీవ్ర ఆగ్రహం ప్రకటించాడు. ‘స్టుపిడ్.. స్టుపిడ్.. అంత తెలివితక్కువ షాట్ ఎలా ఆడావ్’ అని నాడు మందలించాడు. కానీ అదే పంత్ తాజాగా ఇంగ్లండ్‌పై తొలి టెస్ట్‌లో శతకం సాధించిన తీరుతో గవాస్కర్‌కు ముచ్చటేసింది. దీంతో ‘పంత్.. సూపర్బ్.. సూపర్బ్’ అని ప్రశంసల జల్లు కురిపించాడు.