Share News

RCB IPL 2025: ఆర్సీబీకి వరుస షాకులు.. ఇంతకంటే అన్‌లక్కీ టీమ్ ఉండదు

ABN , Publish Date - May 06 , 2025 | 03:28 PM

Royal Challengers Bangalore: ప్లేఆఫ్స్ రేసులో దూసుకెళ్తున్న ఆర్సీబీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. వీటి నుంచి ఆ టీమ్ బయటపడటం అంత ఈజీ కాదు. దీన్ని బెంగళూరు ఎలా ఫేస్ చేస్తుందో చూడాలి.

RCB IPL 2025: ఆర్సీబీకి వరుస షాకులు.. ఇంతకంటే అన్‌లక్కీ టీమ్ ఉండదు
RCB

ఐపీఎల్-2025లో వరుస విజయాలతో హోరెత్తిస్తోంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచుల్లో 7 విజయాలతో పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో కొనసాగుతోంది ఆర్సీబీ. నెక్స్ట్ ఆడే 3 మ్యాచుల్లో కనీసం ఒక్కదాంట్లో నెగ్గినా ఆ టీమ్ అధికారికంగా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఇప్పుడు ఉన్న జోరులో ఒక్క మ్యాచ్‌లో నెగ్గడం పెద్ద విషయమేమీ కాదు. అందుకే ప్లేఆఫ్స్‌తో పాటు ఫైనల్స్ గురించి ఆ టీమ్ మేనేజ్‌మెంట్ వ్యూహాలు పన్నుతోంది. అయితే ఆర్సీబీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. మరి.. ఆ షాకుల సంగతేంటో ఇప్పుడు చూద్దాం..

josh-hazlewood.jpg


ఆడతారా.. ఆడరా..

వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న ఆర్సీబీకి.. ఇంజ్యురీస్ బిగ్ ఇష్యూగా మారాయి. ప్రధాన ఆటగాళ్లంతా వరుసబెట్టి గాయాలపాలవడం బెంగళూరు మేనేజ్‌మెంట్‌తో పాటు అభిమానుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. తాజా సీజన్‌లో అదరగొడుతున్న కెప్టెన్ రజత్ పాటిదార్, ఓపెనర్ ఫిల్ సాల్ట్‌తో పాటు పేసర్ జోష్ హేజల్‌వుడ్‌ ఇంజ్యురీస్‌తో ఇబ్బంది పడుతున్నారు. హేజల్‌వుడ్ భుజం గాయంతో బాధపడుతుండగా.. సారథి పాటిదార్‌ చేతి వేలికి ఇంజ్యురీ అయిందని తెలుస్తోంది. సాల్ట్ జ్వరంతో బాధపడుతున్నాడని సమాచారం. కారణాలు తెలియవు గానీ పించ్ హిట్టర్ రొమారియో షెఫర్డ్ ప్లేఆఫ్స్ మ్యాచులకు అందుబాటులో ఉండకపోవచ్చని వినిపిస్తోంది.RCB.jpg


టెన్షన్.. టెన్షన్

సీఎస్‌కేతో జరిగిన లాస్ట్ మ్యాచ్‌లో సాల్ట్ స్థానంలో యంగ్ ఓపెనర్ జేకబ్ బేతెల్‌ను ఆడించింది ఆర్సీబీ. గాయం కారణంగా మ్యాచ్‌కు దూరమైన హేజల్‌వుడ్‌కు బదులుగా సీనియర్ పేసర్ లుంగీ ఎంగిడిని రీప్లేస్ చేసింది. ఇప్పుడు పాటిదార్, షెఫర్డ్‌ కూడా దూరమయ్యే ప్రమాదం ఉండటంతో బెంగళూరు అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు. సాల్ట్ స్థానంలో వచ్చిన బేతెల్ రాణించినా.. ప్లేఆఫ్స్, ఫైనల్స్‌ లాంటి హైటెన్షన్ మ్యాచుల్లో సాలిడ్, ఎక్స్‌పీరియెన్స్‌డ్ ఓపెనర్ అవసరం. హేజల్‌వుడ్ బిగ్ మ్యాచ్ ప్లేయర్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాటిదార్ ఆడకపోతే ఆర్సీబీ మిడిలార్డర్ పూర్తిగా బలహీనంగా మారుతుంది. షెఫర్డ్ లేకపోతే ఫినిషింగ్ కష్టాలు మొదలవుతాయి. అందుకే ఎట్టి పరిస్థితుల్లో వీళ్లను ప్లేఆఫ్స్ వరకు ఫిట్‌గా మార్చాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వీళ్లలో ఏ ఇద్దరు ఆడకపోయినా ఇంకో ట్రోఫీ సమర్పయామి అని నెటిజన్స్ అంటున్నారు. ఇన్నాళ్లూ అద్భుతంగా ఆడుతూ వచ్చిన జట్టుకు ఇలా బ్యాక్ టు బ్యాక్ షాకులు తగలడం దురదృష్టకరమని చెబుతున్నారు.


ఇవీ చదవండి:

సన్‌రైజర్స్ ఫ్లాప్.. కోచ్ యూటర్న్

వాళ్ల వల్లే ఈ స్థాయిలో ఉన్నా: కోహ్లీ

చరణ్‌ను కాపీ కొట్టిన డీసీ బ్యాటర్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 06 , 2025 | 03:36 PM