Share News

IPL 2025: ఒక్కో సిక్స్‌కు 6 ఇళ్లలో కరెంట్.. ఐపీఎల్ టీమ్ ప్రామిస్

ABN , Publish Date - May 01 , 2025 | 08:54 PM

Indian Premier League: సిక్స్ కొడితే చాలు.. కరెంట్ లేక ఇబ్బందులు పడుతున్న 6 కుటుంబాల్లో వెలుగులు నింపొచ్చు. ఐపీఎల్‌లోని ఓ జట్టు ఇచ్చిన ప్రామిస్ ఇది. మరి.. ఏదా టీమ్ అనేది ఇప్పుడు చూద్దాం..

IPL 2025: ఒక్కో సిక్స్‌కు 6 ఇళ్లలో కరెంట్.. ఐపీఎల్ టీమ్ ప్రామిస్
IPL 2025

మన దేశం అభివృద్ధి పథంలో వేగంగా పరుగులు పెడుతోంది. అమెరికా, చైనా లాంటి అగ్రదేశాలకు దీటుగా అన్ని రంగాల్లోనూ ఎదుగుతోంది. అయితే ఇప్పటికీ కొన్ని మారుమూల ప్రాంతాల్లో కరెంట్ లేకపోవడం, తాగునీటి సమస్యలు లాంటివి ఇంకా చూడొచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్‌ను పరిష్కరించేందుకు పలు ఎన్జీవోలు నిత్యం శ్రమిస్తున్నాయి. వీళ్లకు ఊతం ఇచ్చేందుకు తాజాగా నడుం బిగించింది రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం. ఇందులో భాగంగా ఇవాళ ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో కొట్టే ప్రతి సిక్స్‌తో 6 ఇళ్లలో వెలుగులు నింపాలని డిసైడ్ అయింది ఆర్ఆర్. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..


పింక్ జెర్సీ అందుకే..

రాజస్థాన్ టీమ్ ప్రతి మ్యాచ్‌లో పింక్, బ్లూ కలర్ జెర్సీతో బరిలోకి దిగుతుంది. అయితే ఔరత్ హై తో భారత్ హై అనే క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్న రాయల్ రాజస్థాన్ ఫౌండేషన్‌కు సపోర్ట్‌గా ఇవాళ పింక్ ప్రామిస్‌లో భాగంగా టోటల్ పింక్ కలర్ జెర్సీతో ఆడుతున్నారా టీమ్ ఆటగాళ్లు. ముంబైతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో నమోదయ్యే ప్రతి సిక్సర్‌తో 6 ఇళ్లకు కరెంట్ అందిస్తారు. దీని వల్ల సంభార్ లేక్ టౌన్ మున్సిపాలిటీలోని ప్రజలు ఎక్కువగా ప్రయోజనం పొందనున్నారు. రాజస్థాన్-ముంబై మ్యాచ్‌కు అమ్ముడుపోయిన టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని కూడా పేదల ఇళ్లలో వెలుగులు నింపడానికే వినియోగించనున్నారు. గతేడాది కూడా ఇలాంటి క్యాంపెయిన్ చేసింది రాజస్థాన్ మేనేజ్‌మెంట్. అందులో భాగంగా 250 ఇళ్లలో వెలుగులు నింపింది. దీంతో రాజస్థాన్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇదో అద్భుతమైన కార్యక్రమమని.. దీన్ని ఇలాగే కొనసాగించాలని నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు.


ఇవీ చదవండి:

గర్ల్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసిన ధవన్

కోహ్లీ సీక్రెట్ రివీల్ చేసిన ధోని

నా టార్గెట్ అదే: రోహిత్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 01 , 2025 | 08:54 PM