Joanna Child: 64 ఏళ్ల వయసులో క్రికెట్ డెబ్యూ.. ఈ బామ్మకు హ్యాట్సాఫ్
ABN , Publish Date - Apr 11 , 2025 | 01:02 PM
Cricket News: మనవళ్లతో ఆడుకునే వయసులో ఓ బామ్మ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో డెబ్యూ చేసింది. 64 ఏళ్ల వయసులో బరిలోకి దిగి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. మరి ఎవరా ప్లేయర్.. ఆమెది ఏ దేశం.. అనేది ఇప్పుడు చూద్దాం..

వృద్ధాప్యం వచ్చిందంటే చాలా మంది ఇంటికే పరిమితమవుతారు. 60 ఏళ్లు దాటితే ఎక్కువ మంది రిటైర్మెంట్ తీసుకొని మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకుంటూనో లేదా తమకు నచ్చిన గార్డెనింగ్, దైవారాధన లాంటివి చేస్తూ కాలం గడపడం చూస్తుంటాం. అయితే కొందరు మాత్రం ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్ అని నమ్ముతారు. అలాంటి వారు కలల్ని నెరవేర్చుకోవడానికి వయసు అడ్డు కాదని నిరూపిస్తారు. జొవన్నా చైల్డ్ కూడా ఈ కోవకు చెందిన వ్యక్తే. పోర్చుగల్‌కు చెందిన ఈ బామ్మ.. 64 ఏళ్ల వయసులో ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి డెబ్యూ ఇచ్చి అందర్నీ షాక్‌కు గురి చేసింది.
రేర్ ఫీట్
అల్బేర్గియా వేదికగా ఏప్రిల్ 7న నార్వేతో జరిగిన మ్యాచ్‌లో పాల్గొంది జొవన్నా చైల్డ్. పోర్చుగల్ తరఫున బరిలోకి దిగిన ఆమె.. అరుదైన ఘనతను అందుకుంది. అత్యధిక వయసులో డెబ్యూ మ్యాచ్ ఆడిన రెండో మహిళా క్రికెటర్‌గా ఆమె రికార్డు సృష్టించింది. ఆండ్రూ బ్రౌన్లీ (62 ఏళ్ల 145 రోజులు), మేలీ మూర్ (62 ఏళ్ల 25 రోజులు)ను చైల్డ్ దాటేసింది. ఈ లిస్ట్‌లో సాలీ బార్టన్ (66 ఏళ్ల 334 రోజులు) టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. కాగా, నార్వేతో మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు దిగిన చైల్డ్.. 2 పరుగులు మాత్రమే చేసింది. అలాగే బౌలింగ్‌లో 4 బంతులు వేసిన ఆమె.. 11 పరుగులు ఇచ్చుకుంది. ఈ మ్యాచ్‌లో పోర్చుగల్ తరఫున చైల్డ్‌తో పాటు 16 నుంచి 17 ఏళ్ల వయసు ఉన్న పలువురు కుర్ర ప్లేయర్లు కూడా ఆడారు. అయితే 64 ఏళ్ల వయసులో ఏమాత్రం భయపడకుండా మంచి ఉత్సాహంతో చైల్డ్ ఆడిన తీరును అంతా మెచ్చుకుంటున్నారు. ఇలాంటి వాళ్లను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని అంటున్నారు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి