Share News

ఒలింపిక్స్‌కు క్రికెట్‌ కిక్‌

ABN , Publish Date - Apr 11 , 2025 | 05:37 AM

లాస్‌ ఏంజిల్స్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు ఖరారైంది. 2028లో జరిగే విశ్వక్రీడల్లో కొత్తగా ఐదు క్రీడలకు అవకాశం కల్పిస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. దీంతో 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో మళ్లీ క్రికెట్‌...

ఒలింపిక్స్‌కు క్రికెట్‌ కిక్‌

  • ఆరు జట్లు.. టీ20 ఫార్మాట్‌

  • ఆతిథ్య అమెరికాకు బెర్త్‌ ఖరారు

  • ఐసీసీ ర్యాంకుల ఆధారంగా మిగతా ఐదు?

న్యూఢిల్లీ: లాస్‌ ఏంజిల్స్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు ఖరారైంది. 2028లో జరిగే విశ్వక్రీడల్లో కొత్తగా ఐదు క్రీడలకు అవకాశం కల్పిస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. దీంతో 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో మళ్లీ క్రికెట్‌ సందడి చేయనుంది. 1900లో పారి్‌సలో జరిగిన మెగా క్రీడల్లో క్రికెట్‌కు తొలి.. చివరిసారి చోటు దక్కింది. లాస్‌ ఏంజిల్స్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ ఈవెంట్‌ను టీ20 ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు. పురుషుల, మహిళల విభాగాల్లో ఆరేసి జట్ల చొప్పున ఆడనున్నాయి. అయితే, అర్హత ప్రక్రియను త్వరలో ఖరారుచేస్తారు. ఆతిథ్య హోదాలో అమెరికాకు ఓ బెర్త్‌ ఖరారు కాగా.. మిగతా ఐదు స్థానాల కోసం జట్లు పోటీపడనున్నాయి. కటాఫ్‌ తేదీకి ముందు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్‌-5లో నిలిచిన జట్లకు ఒలింపిక్‌ బెర్త్‌లు దక్కే చాన్సుంది. ఐసీసీ ఈవెంట్ల తరహాలోనే ప్రతి టీమ్‌లో 15 మంది ఉంటారు. ఈసారి రికార్డు స్థాయిలో 351 మెడల్‌ ఈవెంట్లు నిర్వహించాలని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ ఎగ్జిక్యూటివ్‌ బోర్డ్‌ నిర్ణయం తీసుకొంది. ఈ ఒలింపిక్స్‌లో క్రికెట్‌తోపాటు సాఫ్ట్‌బాల్‌, స్క్వాష్‌, ఫ్లాగ్‌ ఫుట్‌బాల్‌, లక్రాస్‌ (సిక్సెస్‌)కు చోటు దక్కింది.

ఇవి కూడా చదవండి:

సీఎస్‌కేలో కీలక పరిణామం.. రుతురాజ్ స్థానంలో ధోనీ

రండి చూస్కుందాం.. గిల్ వార్నింగ్

ఒలింపిక్స్‌లో క్రికెట్‌.. ఆ జట్లకే చాన్స్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 11 , 2025 | 05:37 AM