CSK Captain Dhoni: సీఎస్‌కేలో కీలక పరిణామం.. రుతురాజ్ స్థానంలో ధోనీ
ABN , Publish Date - Apr 10 , 2025 | 07:06 PM
వరుస ఓటములతో ఇబ్బంది పడుతున్న సీఎస్‌కేలో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. టీమ్ కెప్టెన్సీ బాధ్యతలు మళ్లీ ధోనీ చేతుల్లోకి వెళ్లాయి. మోచేయి గాయం కారణంగా రుతురాజ్ గైక్వాడ్ ఈ సీజన్ నుంచి తప్పుున్నట్టు జట్టు కోచ్ ప్టీఫెన్ ఫ్లెమింగ్ పేర్కొన్నాడు.

ఇంటర్నెట్ డెస్క్: వరుస ఓటములతో సతమతమవుతున్న సీఎస్‌కేలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎస్‌కే బాధ్యతలు మళ్లీ ధోనీ చేతుల్లోకే వెళ్లాయి. మోచేయి గాయం కారణంగా రుతురాజ్ ఈ ఐపీఎల్ సీజన్ నుంచి తప్పుకున్నాడు. సీఎస్‌కే కెప్టెన్సీ బాధ్యతలు ధోనీ నిర్వహించనున్న విషయాన్ని చెన్నై కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తాజాగా ధ్రువీకరించారు. ‘‘మోచేయి ఫ్రాక్చర్ కారణంగా రుతురాజ్ గైక్వాడ్ ఈ సీజన్‌కు దూరమయ్యాడు. ఇకపై చెన్నై కెప్టెన్‌గా ధోనీ ఉంటాడు’’ అని ఫ్లెమింగ్ పేర్కొన్నాడు. ఈ మేరకు సీఎస్‌కే కూడా ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. జోఫ్రా ఆర్చర్ వేసిన ఓవర్‌లో ఓ షార్ట్ బాల్ కారణంగా గైక్వాడ్ చేతికి గాయమైన విషయం తెలిసిందే.
రేపు కోల్‌కతాతో జరగనున్న మ్యాచ్ నుంచి ధోనీ చెన్నైకి సారథిగా బరిలో నిలవనున్నాడు. మహీ సారథ్యంలో సీఎస్‌కే ఇప్పటికే ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచింది. దీంతో, ఈసారి అభిమానుల ఆశలు ధోనీపై మళ్లాయి. ఇదిలా ఉంటే, ఈ సీజన్ మొదలైన నాటి నుంచి చెన్నై తడబాటుకు లోనవుతోంది. ఇప్పటివరకూ చెన్నై ఐదు మ్యాచులు ఆడగా ఏకంగా నాలుగింట్లో ఓటమి చవి చూసింది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానానికి దిగజారింది.
కాగా, మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప ఇటీవల ధోనీ ఫామ్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. ధోనీలో పట్టుదల తగ్గకపోయినా టీమ్ అవసరాల దృష్ట్యా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడని అన్నాడు. ప్రస్తుతం ధోనీ ఫామ్‌ను బట్టి చూస్తూ అతడిని ఇన్నింగ్స్ మొదట్లో బ్యాటింగ్‌కు దించితే అతడి ప్రభావం మరింతగా ఉండే అవకాశం ఉందని అన్నాడు. ఇటీవల పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 18 పరుగుల తేడాతో ఓటమి చవి చూసిన విషయం తెలిసిందే. ఛేదనలో చెన్నై మొదట దూకుడుగా కనిపించినా మిడిల్ ఓవర్స్‌లో తడబడటం ఓటమికి బాటలు వేసింది. చివరి ఓవర్సలో ధోనీ 12 బంతుల్లో ఏకంగా 27 పరుగులు చేసినా చెన్నైకి ఓటమి తప్పలేదు.
ఇవి కూడా చదవండి:
కొత్త కాంట్రవర్సీలో టీమిండియా స్టార్
రండి చూస్కుందాం.. గిల్ వార్నింగ్
ఒలింపిక్స్‌లో క్రికెట్.. ఆ జట్లకే చాన్స్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి