Share News

ధోనీకి ‘చెన్నై’ పగ్గాలు

ABN , Publish Date - Apr 11 , 2025 | 05:42 AM

మాజీ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌కు గట్టి ఝలక్‌ తగిలింది. ఇప్పటికే నాలుగు వరుస ఓటములతో డీలాపడిన ఈ జట్టుకు.. తాజాగా కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ కూడా దూరమయ్యాడు...

ధోనీకి ‘చెన్నై’ పగ్గాలు

గాయంతో రుతురాజ్‌ దూరం

చెన్నై: మాజీ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌కు గట్టి ఝలక్‌ తగిలింది. ఇప్పటికే నాలుగు వరుస ఓటములతో డీలాపడిన ఈ జట్టుకు.. తాజాగా కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ కూడా దూరమయ్యాడు. అతడి మోచేయి ఫ్రాక్చర్‌ కావడంతో ఐపీఎల్‌కు అందుబాటులో ఉండడని, ఇక లీగ్‌లో మిగిలిన మ్యాచ్‌లకు ఎంఎస్‌ ధోనీ సారథిగా వ్యవహరిస్తాడని సీఎ్‌సకే ప్రకటించింది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌కే రుతురాజ్‌ దూరమవుతాడని భావించినా.. ఆఖరి నిమిషంలో బరిలోకి దిగాడు. నేడు కేకేఆర్‌తో చెన్నై జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. మరోవైపు తాజా సీజన్‌లో పేలవ ఫామ్‌లో ఉన్న రుతురాజ్‌ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో కేవలం 122 పరుగులు మాత్రమే చేశాడు. అటు కెప్టెన్సీలోనూ ప్రభావం చూపలేకపోయాడు. ఇప్పుడతని స్థానంలో త్రిపాఠి, హుడాలలో ఒకరిని తీసుకునే అవకాశముంది. అయితే ఈ ఇద్దరూ ఇదివరకే ఆడి ఫామ్‌లేమితో చోటు కోల్పోవడం గమనార్హం. వీరిద్దరితోపాటు వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిన పృథ్వీషాకూ అవకాశముంది.

ఇవి కూడా చదవండి:

సీఎస్‌కేలో కీలక పరిణామం.. రుతురాజ్ స్థానంలో ధోనీ

రండి చూస్కుందాం.. గిల్ వార్నింగ్

ఒలింపిక్స్‌లో క్రికెట్‌.. ఆ జట్లకే చాన్స్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 11 , 2025 | 05:42 AM