Share News

PBKS vs MI Toss: టాస్ గెలిచారు.. అసలు సవాల్‌లో నిలుస్తారా!

ABN , Publish Date - May 26 , 2025 | 07:02 PM

హేమాహేమీల సమరం షురూ అయింది. తాడోపేడో తేల్చుకునేందుకు పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ సిద్ధమైపోయాయి. ఈ ఇరు జట్ల మధ్య సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా కీలక పోరు జరుగుతోంది.

PBKS vs MI Toss: టాస్ గెలిచారు.. అసలు సవాల్‌లో నిలుస్తారా!
PBKS vs MI Toss

ఐపీఎల్-2025 ప్లేఆఫ్స్‌ బెర్త్‌లను మార్చేసే కీలక పోరు మొదలైంది. ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన పంజాబ్ కింగ్స్-ముంబై ఇండియన్స్.. క్వాలిఫికేషన్-1కు వెళ్లాలని చూస్తున్నాయి. అందుకే సవాయ్‌ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా జరుగుతున్న పోరులో ఎట్టి పరిస్థితుల్లో నెగ్గితీరాలని పంతంతో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తొలుత బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ముంబై మొదట బ్యాటింగ్‌కు దిగనుంది. ప్లేయింగ్ ఎలెవన్ విషయంలో పంజాబ్ కొన్ని మార్పుచేర్పులు చేసింది. పేసర్ కైల్ జెమీసన్, వైశాఖ్ విజయ్‌కుమార్‌కు పంజాబ్ తుదిజట్టులో చోటు దక్కింది. మిగిలిన ప్లేసుల్లో గత మ్యాచ్‌లో ఆడిన వాళ్లనే అయ్యర్ కొనసాగిస్తున్నాడు. ముంబై ఇండియన్స్ మాత్రం ఒక్క మార్పు కూడా చేయలేదు. లాస్ట్ మ్యాచ్‌లో ఆడిన ప్లేయర్లనే కంటిన్యూ చేస్తోంది.


ఆపకపోతే కష్టమే..

పంజాబ్ టాస్ నెగ్గినా ఇక్కడితో అయిపోలేదు. ముంబైని బ్యాటింగ్‌కు దింపుతున్నారు కాబట్టి తక్కువ స్కోరుకు కట్టడి చేయడం చాలా ముఖ్యం. పవర్ హిట్టర్లతో కూడిన ముంబైని 180 లోపు కట్టడి చేస్తే గెలిచే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ అంతకుమించి టార్గెట్ సెట్ చేస్తే మాత్రం జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ లాంటి ఎక్స్‌ప్రెస్ బౌలర్లను తట్టుకొని చేజింగ్ చేయడం పెద్ద సవాలుగా మారుతుంది. ఈ నేపథ్యంలో అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్‌తో కూడిన బౌలింగ్ యూనిట్ మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి. తప్పక గెలవని సిచ్యువేషన్ కావడంతో ఇరు జట్లలోని ప్రతి ఆటగాడు బెస్ట్ ఇవ్వాలని చూస్తున్నాడు. కాబట్టి మ్యాచ్ ఆఖరి బంతి వరకు రసవత్తరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.


ఇవీ చదవండి:

ఫైనల్ కాని ఫైనల్.. అస్సలు మిస్ అవ్వొద్దు!

బోటు బోల్తా.. సముద్రంలో దాదా ఫ్యామిలీ

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 26 , 2025 | 07:33 PM