Mohammed Shami: బీసీసీఐ నిర్ణయంపై మహ్మద్ షమీ ఘాటు వ్యాఖ్యలు..
ABN , Publish Date - Oct 15 , 2025 | 09:08 AM
తన చేతుల్లో సెలక్షన్ ఉండదని పేర్కొన్నారు. తనకు ఫిట్నెస్ సమస్య ఉంటే తాను బెంగాల్ కోసం రంజీ ట్రోఫీ ఆడలేని పరిస్థితి ఉంటుందని తెలిపారు.
ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌కు తనను ఎంపిక చేయకపోవడంపై టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్టోబర్ 19 నుంచి ప్రారంభమయ్యే భారత్-ఆస్ట్రేలియా వన్డే సిరీస్ జట్టులో షమీకి చోటు దక్కని విషయం తెలిసిందే. షమీని జట్టులోకి తీసుకోకపోవడంపై మొదట పెద్దగా చర్చలు లేకపోయిన తాజాగా ఆయన స్పందించడంపై దుమారం చెలరేగింది.
ఈ సందర్భంగా షమీ మాట్లాడుతూ.. తన చేతుల్లో సెలక్షన్ ఉండదని పేర్కొన్నారు. తనకు ఫిట్నెస్ సమస్య ఉంటే తాను బెంగాల్ కోసం రంజీ ట్రోఫీ ఆడలేని పరిస్థితి ఉంటుందని తెలిపారు. నాలుగు రోజుల మ్యాచ్ ఆడగలిగితే, 50 ఓవర్ల క్రికెట్ కూడా ఆడగలను అని తేల్చి చెప్పారు. ఫిట్‌నెస్ గురించి సెలెక్షన్ కమిటీకి సమాచారం అందించడం తన పని కాదన్నారు. ఎన్‌సీఏకు వెళ్లి సిద్ధమవడం.. మ్యాచ్‌లాడటమే తన పని అని షమి స్పష్టం చేశారు. తనని ఎంపిక చేయకపోతే బెంగాల్ కోసం ఆడతాను, దానిపై ఎలాంటి అభ్యంతరం లేదని షమీ వివరించారు. దేశం కోసం ఉత్తమ ఆటగాళ్లను ఎంపిక చేయాలి. గెలుపు దేశానికే చెందాలి అని ఆయన వ్యాఖ్యనించారు.
షమీ చివరిసారి మార్చ్ 2025లో చాంపియన్స్ ట్రోఫీలో భారత్ తరఫున ఆడారు. ఆ సిరీస్‌లో వరుణ్ చక్రవర్తితో కలిసి టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. అయినప్పటికీ ఆ తర్వాత ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్, ఆసియా కప్, ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లలో షమీకు అవకాశం ఇవ్వలేదు. అయితే తాజాగా.. షమీ చేసిన వ్యాఖ్యలు స్పష్టంగా బీసీసీఐ నిర్ణయంపై అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
The Supreme Court has directed: ఇందిరా టెలివిజన్ కేసులో కౌంటర్ వేయండి
Data Center : అమెరికా బయట భారీ పెట్టుబడి రామ్మోహన్