Share News

MI vs CSK Prediction: ముంబై వర్సెస్ సీఎస్‌కే.. ఓడితే ఇంటికే.. ఆప్షన్ లేదు మిత్రమా

ABN , Publish Date - Apr 20 , 2025 | 06:20 PM

IPL 2025: ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఇవాళ సమరం జరగనుంది. సండే ఫైట్‌లో ఇరు జట్లూ తప్పక నెగ్గాల్సిన సిచ్యువేషన్. సీఎస్‌కే ఓడితే తట్టా బుట్టా సర్దుకొని ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. కాబట్టి గెలుపు కోసం ఆఖరి క్షణం వరకు ప్రయత్నించడం ఖాయం.

MI vs CSK Prediction: ముంబై వర్సెస్ సీఎస్‌కే.. ఓడితే ఇంటికే.. ఆప్షన్ లేదు మిత్రమా
MI vs CSK Prediction

ఐపీఎల్-2025 ఇవాళ మరింత హీటెక్కనుంది. ఆల్రెడీ ఆర్సీబీ-పంజాబ్ మధ్య రసవత్తర పోరు జరగుతోంది. అది ప్లేఆఫ్స్ బెర్త్‌లను షేక్ చేసే ఫైట్. మరోవైపు రేసులో నిలబడాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితుల్లో చెన్నై సూపర్ కింగ్స్-ముంబై ఇండియన్స్ తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ రెండు టీమ్స్ మధ్య వాంఖడే స్టేడియంలో ఇవాళ రాత్రి పోరు జగరనుంది. ప్లేఆఫ్స్ చేరాలంటే ఇకపై ఆడే ప్రతి మ్యాచ్‌లో నెగ్గడం ధోని టీమ్‌కు కంపల్సరీ. కాబట్టి గెలవడం తప్ప ఎల్లో ఆర్మీకి మరో ఆప్షన్ లేదు. ఈ నేపథ్యంలో ఇరు టీమ్స్ బలాబలాలు, గత రికార్డుల గురించి ఇప్పుడు చూద్దాం..


బలాలు

చెన్నై: రచిన్ రవీంద్ర, శివమ్ దూబె లాస్ట్ మ్యాచ్‌‌తో ఫామ్‌లోకి వచ్చారు. తెలుగు కుర్రాడు షేక్ రషీద్ అదరగొడుతున్నాడు. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆఖర్లో వచ్చి విలువైన పరుగులు చేయడం బిగ్ ప్లస్. బౌలింగ్‌లో జడేజా, పతిరానా వికెట్లు తీస్తుండటం శుభపరిణామం. అన్షుల్ కాంబోజ్ కూడా ఎఫెక్టివ్‌గా బౌలింగ్ చేస్తున్నాడు.

ముంబై: వరుసగా రెండు విజయాలు దక్కడంతో హార్దిక్ సేన జోష్‌లో ఉంది. విల్ జాక్స్, రికల్టన్, సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మతో పాటు కెప్టెన్ పాండ్యా బ్యాటింగ్‌లో అదరగొడుతున్నారు. బౌలింగ్‌లో బౌల్ట్, బుమ్రా, జాక్స్ రాణిస్తున్నారు.


బలహీనతలు

చెన్నై: ఎన్నో ఆశలు పెట్టుకున్న రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్ పెద్దగా రాణించడం లేదు. వేగంగా పరుగులు చేయలేకపోతున్నారు. జడేజా కూడా బౌలింగ్‌లో రాణిస్తున్నా.. బ్యాటింగ్‌లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. దూబె పేసర్ల బౌలింగ్‌లో మరింత రెచ్చిపోయి ఆడాల్సిన అవసరం ఉంది.

ముంబై: సీనియర్ బ్యారట్ రోహిత్ శర్మ గత మ్యాచ్‌లో బాగానే ఆడాడు. అయితే అతడి దగ్గర నుంచి మరిన్ని పరుగుల్ని ఆశిస్తోంది టీమ్ మేనేజ్‌మెంట్. సూర్యకుమార్, రికల్టన్ నిలకడగా పరుగులు చేస్తే ముంబైకి ఢోకా ఉండదు. బౌలింగ్‌లో చాహర్, పాండ్యా నుంచి కన్‌సిస్టెన్సీని కోరుకుంటున్నారు ఫ్యాన్స్.


హెడ్ టు హెడ్

ఈ రెండు టీమ్స్ మధ్య ఇప్పటివరకు 38 మ్యాచులు జరిగాయి. ఇందులో సీఎస్‌కే 18 మ్యాచుల్లో, ముంబై 20 మ్యాచుల్లో గెలిచాయి.

విన్నింగ్ ప్రిడిక్షన్

బలాబలాలు, ఫామ్, హోం గ్రౌండ్ అడ్వాంటేజ్, హెడ్ టు హెడ్ రికార్డ్స్.. ఇలా ఏది చూసుకున్నా సీఎస్‌కే కంటే ముంబై చాలా స్ట్రాంగ్‌గా ఉంది. కాబట్టి ఇవాళ్టి పోరులో హార్దిక్ సేన విజయం సాధించడం ఖాయం.


ఇవీ చదవండి:

ఆప్షన్ లేదు మిత్రమా.. ఓడితే ఇంటికే..

కృనాల్ పాండ్యా స్టన్నింగ్ క్యాచ్

ఏడుగురు అథ్లెట్లు, ముగ్గురు కోచ్‌లపై బ్యాన్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 20 , 2025 | 06:25 PM