Share News

Jasprit Bumrah: బుమ్రాకు ప్రతిష్టాత్మక పురస్కారం.. తొలి బౌలర్‌గా రికార్డు

ABN , Publish Date - Jan 27 , 2025 | 04:14 PM

Jasprit Bumrah Won ICC Award: టీమిండియా పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా ఓ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని గెలుచుకున్నాడు. ఈ అవార్డుకు ఎంపికైన తొలి బౌలర్‌గా అతడు రికార్డు క్రియేట్ చేశాడు.

Jasprit Bumrah: బుమ్రాకు ప్రతిష్టాత్మక పురస్కారం.. తొలి బౌలర్‌గా రికార్డు
Jasprit Bumrah

టీమిండియా పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా అరుదైన గౌరవం దక్కించుకున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నుంచి ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అతడు అందుకున్నాడు. గతేడాది క్రికెట్‌లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన ఆటగాళ్లకు అవార్డులు ప్రకటించింది ఐసీసీ. అందులో టెస్టు ఫార్మాట్‌ బెస్ట్ క్రికెటర్‌ అవార్డుకు ఎంపికయ్యాడు బుమ్రా. తద్వారా చరిత్ర సృష్టించాడీ స్పీడ్‌స్టర్. ఐసీసీ నుంచి టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం అందుకున్న తొలి భారత ఆటగాడిగా అతడు రికార్డులకెక్కాడు. దీంతో అభిమానులు అతడ్ని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. జట్టు ప్రతిష్టను మరింత పెంచావంటూ మెచ్చుకుంటున్నారు.


స్మృతి మంధానకూ అవార్డు!

ఐసీసీ అవార్డుల్లో టీమిండియాకు మరో ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. భారత మహిళా స్టార్ బ్యాటర్ స్మృతి మంధానకు అవార్డు దక్కింది. ఐసీసీ విమెన్స్ ఓడీఐ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారానికి ఆమె ఎంపికైంది. దీంతో భారత అభిమానుల సంతోషం డబుల్ అయింది. ఒకవైపు బుమ్రా, మరోవైపు మంధాన టీమిండియా ప్రతిష్టను పెంచడం, క్రేజీ అవార్డులు కొట్టేయడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇక మీదట కూడా వీళ్లు ఇలాగే ఆడాలని.. దేశ కీర్తి ప్రతిష్టలను మరింత ఇనుమడింప చేయాలని కోరుకుంటున్నారు.


ఇవీ చదవండి:

మూడో టీ20కి టీమిండియా ప్లేయింగ్ 11.. విధ్వంసక బ్యాటర్ రీఎంట్రీ

రోహిత్ బ్లండర్ మిస్టేక్.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాడు

ప్లాన్ ప్రకారమే అటాక్.. తిలక్ మామూలోడు కాదు

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 27 , 2025 | 04:25 PM