Share News

CSK vs PBKS Toss: టాస్ నెగ్గిన పంజాబ్.. అయినా వదలని భయం

ABN , Publish Date - Apr 30 , 2025 | 07:07 PM

CSK vs PBKS Prediction: ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే పక్కా గెలవాల్సిన సిచ్యువేషన్‌లో ఉన్న పంజాబ్ కింగ్స్ కీలక పోరుకు సిద్ధమైంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో చెపాక్‌లో తాడోపేడో తేల్చుకునేందుకు రెడీ అయిపోయింది అయ్యర్ సేన.

CSK vs PBKS Toss: టాస్ నెగ్గిన పంజాబ్.. అయినా వదలని భయం
CSK vs PBKS Toss

ప్లేఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ అవ్వాలంటే తప్పక నెగ్గాల్సిన పరిస్థితుల్లో చెన్నై సూపర్ కింగ్స్‌తో ఫైట్‌కు రెడీ అయిపోయింది పంజాబ్ కింగ్స్. ఈ రెండు జట్ల మధ్య చెపాక్ వేదికగా ఆసక్తికర సమరం జరుగుతోంది. ఇందులో టాస్ నెగ్గిన పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఆతిథ్య చెన్నై మొదట బ్యాటింగ్‌కు దిగనుంది. టాస్ గెలిచినా పంజాబ్ శిబిరంలో భయం పోవడం లేదు. దీనికి కారణం చెపాక్ పిచ్ అనే చెప్పాలి. అక్కడి కండీషన్స్‌ ధోని అండ్ కోకు కొట్టిన పిండి. గత కొన్ని మ్యాచులుగా అక్కడ సీఎస్‌కేకు ఏదీ కలసిరాని మాట వాస్తవమే. కానీ షేక్ రషీద్, డెవాల్డ్ బ్రెవిస్, ఆయుష్ మాత్రే లాంటి యంగ్‌స్టర్స్‌ను సీఎస్‌కే మేనేజ్‌మెంట్ సిద్ధం చేసిన విధానం, వాళ్లతో ఆడిస్తున్న తీరు నెక్స్ట్ లెవల్‌లో ఉంది. స్లో పిచ్‌ మీదా వాళ్లు రఫ్ఫాడిస్తున్నారు. ఇదే పంజాబ్ క్యాంప్‌లో ఫియర్‌కు రీజన్ అని చెప్పాలి.


మార్పులు ఇవే..

ముందుగా అనుకున్నట్లే తమ ప్లేయింగ్ ఎలెవన్‌లో యువ ఆటగాళ్లకు చాన్సులు ఇచ్చింది సీఎస్‌కే. రషీద్ నుంచి నూర్ వరకు చాలా మంది యంగ్‌స్టర్స్‌కు అవకాశాలు కల్పించింది. అటు పంజాబ్ మాత్రం తమ తుదిజట్టులో ఒకట్రెండు మార్పులు చేసింది. రైటాండ్ యంగ్ బ్యాటర్ సూర్యాంశ్ షెడ్గేను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకుంది. ఒమర్జాయి-బార్ట్‌లెట్‌లో ఒకరికే అవకాశం ఇచ్చింది. ఒమర్జాయిని తుదిజట్టులోకి తీసుకుంది. ఈ రెండే మార్పులు. మిగతా టీమ్ అంత గత మ్యాచ్‌లో ఆడినవాళ్లే.


ఇవీ చదవండి:

కలసిపోయిన రింకూ-కుల్దీప్

కోహ్లీపై విమర్శలు.. కౌంటర్ ఇచ్చిపడేశాడుగా

నా భర్త కోసం స్కెచ్ వేశారు: పుజారా భార్య

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 30 , 2025 | 07:16 PM