Share News

Virat Kohli: కోహ్లీపై సంజయ్ మంజ్రేకర్ విమర్శలు.. బ్రదర్ కౌంటర్ ఇచ్చిపడేశాడుగా

ABN , Publish Date - Apr 30 , 2025 | 06:43 PM

ఇటీవల ముంబై, బెంగళూరు మ్యాచ్ సందర్భంగా సంజయ్ చేసిన కామెంట్లు మరింత వివాదాస్పదమయ్యాయి. బుమ్రా, కోహ్లీ పోరును ఇకపై బెస్ట్ వర్సెస్ బెస్ట్‌గా పరిగణించలేమని సంజయ్ వ్యాఖ్యానించాడు. అలాగే ఐపీఎల్ 2025 టాప్ టెన్ బ్యాటర్ల లిస్ట్‌లో కోహ్లీ పేరును సంజయ్ పక్కన పెట్టాడు.

Virat Kohli: కోహ్లీపై సంజయ్ మంజ్రేకర్ విమర్శలు.. బ్రదర్ కౌంటర్ ఇచ్చిపడేశాడుగా
Virat Kohli, Sanjay Manjrekar

మాజీ క్రికెటర్, కామెంటేటర్ అయిన సంజయ్ మంజ్రేకర్ (Sanjay Manjrekar) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు మీద, కింగ్ విరాట్ కోహ్లీ (Virat Kohli) మీద సోషల్ మీడియాలో వివాదాస్పద కామెంట్లు చేస్తుంటాడు. ఇక, ఇటీవల ముంబై, బెంగళూరు మ్యాచ్ సందర్భంగా సంజయ్ చేసిన కామెంట్లు మరింత వివాదాస్పదమయ్యాయి. బుమ్రా, కోహ్లీ పోరును ఇకపై బెస్ట్ వర్సెస్ బెస్ట్‌గా పరిగణించలేమని సంజయ్ వ్యాఖ్యానించాడు. అలాగే ఐపీఎల్ 2025 టాప్ టెన్ బ్యాటర్ల లిస్ట్‌లో కోహ్లీ పేరును సంజయ్ పక్కన పెట్టాడు.


ఈ ఏడాది ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో కోహ్లీ టాప్‌లో ఉంటున్నాడు. అలాంటి కోహ్లీని మంజ్రేకర్ స్ట్రైక్ రేట్ సాకు చూపి పక్కన పెట్టాడు. కోహ్లీ స్ట్రైక్ రేట్ తక్కువ ఉందని పరోక్షంగా ఎద్దేవా చేశాడు. సంజయ్ మంజ్రేకర్ తీరుపై విరాట్ కోహ్లీ సోదరుడు వికాస్ మండిపడ్డాడు. సోషల్ మీడియా ద్వారా అతడికి చురకలు అంటించాడు. వన్డేల్లో కేవలం 64+ స్ట్రైక్ రేట్‌తో మాత్రమే పరుగులు చేసిన సంజయ్ మంజ్రేకర్.. 200+ స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేసే వారి గురించి చులకనగా మాట్లాడతాడని వికాస్ కామెంట్ చేశాడు. ఆ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

kohli2.jpg


కోహ్లీ ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడి 443 పరుగులు చేశాడు. అయితే అతడి స్ట్రైక్ రేట్ మాత్రం 138.87 మాత్రమే. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్ టెన్ బ్యాటర్లలో ఒక్క కోహ్లీ మాత్రమే 145 కంటే తక్కువ స్ట్రైక్ రేట్‌ను కలిగి ఉన్నాడు. ఆ పాయింట్‌నే మంజ్రేకర్ హైలెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నాడు. కోహ్లీ స్ట్రైక్ రేట్ తక్కువగానే ఉన్నప్పటికీ ఆర్సీబీ విజయాల్లో మాత్రం కోహ్లీదే కీలక పాత్ర అని చెప్పక తప్పదు.

ఇవి కూడా చదవండి..

IPL 2025 CSK vs PBKS: చెన్నైకు లాస్ట్ ఛాన్స్.. ఇరు జట్లలో కీలక ఆటగాళ్లు వీరే


ధవన్ దెబ్బకి పాక్ లెజెండ్ షేక్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 30 , 2025 | 06:43 PM