IND vs ENG: తప్పు ఒప్పుకోవాల్సిందే.. టీమిండియాకు ఇంగ్లండ్ లెజెండ్ వార్నింగ్
ABN , Publish Date - Feb 02 , 2025 | 05:32 PM
Team India: భారత్ తన తప్పు ఒప్పుకోవాల్సిందేనని అంటున్నాడు ఇంగ్లండ్ లెజెండ్ కెవిన్ పీటర్సన్. తప్పు చేసినప్పుడు ఒప్పుకోకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నాడు. ఇంకా అతడు ఏమన్నాడంటే..
ఇంగ్లండ్‌తో భారత సిరీస్ ఆఖరుకు చేరుకుంది. ఇవాళ జరిగే 5వ టీ20 మ్యాచ్‌తో ఈ సిరీస్ ముగుస్తుంది. తదుపరి టీమిండియాతో వన్డేలు ఆడనుంది ఇంగ్లీష్ టీమ్. ముంబైలో జరిగే సండే ఫైట్ భారత్ కంటే ఇంగ్లండ్‌కే ప్రతిష్టాత్మకం కానుంది. ఆల్రెడీ 1-3తో సిరీస్ కోల్పోయారు కాబట్టి ఇందులోనైనా నెగ్గి పరువు దక్కించుకోవాలని బట్లర్ సేన పట్టుదలతో ఉంది. అయితే ఐదో టీ20 కంటే కూడా ఈ సిరీస్‌లో ఓ వివాదం గురించి విపరీతంగా చర్చలు జరుగుతున్నాయి. ఆ విషయంలో భారత్ తమకు సారీ చెప్పాలని ఇంగ్లండ్ దిగ్గజం కెవిన్ పీటర్సన్ అంటున్నాడు.
ఇంగ్లండ్ రభస
నాలుగో టీ20లో భారత బ్యాటింగ్ టైమ్‌లో ఆల్‌రౌండర్ శివమ్ దూబె గాయపడ్డాడు. దీంతో బౌలింగ్ సమయంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా అతడి స్థానంలో యంగ్ పేసర్ హర్షిత్ రాణాను టీమ్‌లోకి తీసుకుంది మేనేజ్‌మెంట్. మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ ఓకే చెప్పాకే ఈ డెసిషన్ తీసుకుంది. బరిలోకి దిగిన హర్షిత్ 3 కీలక వికెట్లతో పర్యాటక జట్టు నడ్డి విరిచాడు. భారత్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. దీంతో దూబె స్థానంలో మీడియం పేస్ ఆల్‌రౌండర్‌ను తీసుకోకుండా.. హర్షిత్ లాంటి స్పెషలిస్ట్ స్పీడ్‌స్టర్‌ను ఎలా తీసుకుంటారంటూ గొడవకు దిగుతోంది ఇంగ్లండ్. ఈ అంశంపై ఆ దేశ లెజెండరీ ప్లేయర్ కెవిన్ పీటర్సన్ సీరియస్ అయ్యాడు. మ్యాచ్ రిఫరీ శ్రీనాథ్ తన తప్పు ఒప్పుకోవాల్సిందేనని అన్నాడు.
నిబంధనలో లొసుగులు!
‘కంకషన్ సబ్‌స్టిట్యూట్ టాపిక్ గురించే ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. నా దృష్టిలో అయితే అది సరైన రీప్లేస్‌మెంట్ కాదు. మ్యాచ్ రిఫరీ (శ్రీనాథ్) చేతిని పైకి ఎత్తి తప్పు చేశానని ఒప్పుకోవాలి. తప్పుడు నిర్ణయం తీసుకున్నానని అంగీకరించాలి’ అని పీటర్సన్ డిమాండ్ చేశాడు. అయితే ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు. దూబె బ్యాటింగ్ ముగిసింది కాబట్టి బౌలింగ్ సమయంలో పేసర్‌ను తీసుకుంటే చాలని.. అతడు ఎంత స్పీడ్ బౌలింగ్ వేస్తాడు? లాంటి వివరాలు రూల్‌లో లేవని అంటున్నారు. నిబంధనలో లొసుగులు ఉన్నప్పుడు దానికి భారత్‌ను అనడం ఏంటని.. దిగ్గజ క్రికెటర్ శ్రీనాథ్‌ను తప్పు ఒప్పుకోమనడం సరికాదని సీరియస్ అవుతున్నారు.
ఇవీ చదవండి:
ధోని పొలిటికల్ ఎంట్రీ.. ఇదేం ట్విస్ట్ భయ్యా
తెలుగు బిడ్డ సంచలనం.. వరల్డ్ కప్ విన్నర్‌గా భారత్
డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌స్టార్ జాన్ సీనాకు బిగ్ షాక్.. మ్యాచ్ మధ్యలోనే..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి