John Cena: డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌స్టార్ జాన్ సీనాకు బిగ్ షాక్.. మ్యాచ్ మధ్యలోనే..
ABN , Publish Date - Feb 02 , 2025 | 01:33 PM
WWE Royal Rumble 2025: డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌స్టార్ జాన్ సీనాకు బిగ్ షాక్ తగిలింది. మ్యాచ్ మధ్యలోనే అనుకోని ఘటన చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..

జాన్ సీనా.. ఈ పేరు తెలియని స్పోర్ట్స్ ఫ్యాన్స్ ఉండరంటే అతిశయోక్తి కాదు. వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంటో షో ద్వారా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు సీనా. రింగ్‌లోకి దిగాడంటే సింహంలా ఫైట్ చేస్తూ ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తుంటాడతను. ఎన్ని దెబ్బలు తిన్నా అతడు ఓటమి ఒప్పుకోడు. దెబ్బలు తింటూనే అదను చూసి ఫ్లయింగ్ షోల్డర్ ట్యాకిల్‌తో ఎంతటి ఫైటర్‌నైనా చావుదెబ్బ తీస్తాడు. ఒక్క మూవ్‌తో మ్యాచ్‌ను ముగించేస్తాడు. అలాంటోడికి గట్టి షాక్ తగిలింది. మ్యాచ్ మధ్యలోనే జరిగిన అనూహ్య ఘటన నుంచి సీనా కోలుకోలేకపోయాడు.
అంతా తారుమారు!
కెరీర్‌లో చివరి రాయల్ రంబుల్ మ్యాచ్ ఆడేందుకు రింగ్‌లోకి దిగిన సీనా.. దాదాపు 2 డజన్ల మందిని ఓడించాడు. మొత్తం 30 మంది పోటీపడే ఈ మ్యాచ్‌లో చివరకు సీనాతో పాటు జే ఉసో అనే మరో ఫైటర్ మాత్రమే మిగిలాడు. మహామహాులనే చిత్తు చేసిన చాంపియన్ ఫైటర్.. జే ఉసోను మట్టికరిపించడం పెద్ద కష్టం కాదని అంతా అనుకున్నారు. కానీ చివరి వరకు పోరాడిన ఉసో.. చాకచక్యంతో సీనాను రింగ్ బయటకు పంపి రాయల్ రంబుల్ చాంపియన్‌షిప్ మ్యాచ్‌కు అర్హత సాధించాడు.
ఊహించని రేంజ్‌లో..!
జే ఉసో-జాన్ సీనా తీవ్రంగా పోటీపడ్డారు. ఎవరి మార్క్ షాట్స్‌తో వాళ్లు అటాక్ చేస్తూ పోయారు. ఎంత అలసినా ఓటమి ఒప్పుకోకుండా తీవ్రంగా ఫైట్ చేశారు. అయితే అదృష్టం సీనాకు కలసిరాలేదు. అప్పటివరకు అంత పోరాడినోడు ఉసో తెలివి ముందు నిలబడలేకపోయాడు. తెలివిగా ఆడిన ఉసో.. సీనాను నిలువరించి వెనుక నుంచి నెట్టేశాడు. రింగ్ బయట పడిన చాంపియన్ రెజ్లర్.. అసలు ఎలా ఓడానో తెలియక షాక్‌కు గురయ్యాడు. ఇది అతడి అభిమానులకు కూడా మింగుడుపడటం లేదు. కాగా, ఈ ఏడాది డిసెంబర్‌లో డబ్ల్యూడబ్ల్యూఈకి రిటైర్మెంట్ ప్రకటిస్తానని ఇటీవలే జాన్ సీనా స్పష్టం చేశాడు.
ఇవీ చదవండి:
భారత ప్లేయింగ్ 11లో సంచలన మార్పు.. మ్యాచ్ విన్నర్ వచ్చేస్తున్నాడు
ఆ సీక్రెట్ చెప్పను.. నా భార్య చూస్తోంది: రోహిత్
కోహ్లీ మళ్లీ బ్యాటింగ్‌కు రాకుండానే..!
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి