IND vs ENG: భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో సంచలన మార్పు.. మ్యాచ్ విన్నర్ వచ్చేస్తున్నాడు
ABN , Publish Date - Feb 02 , 2025 | 12:25 PM
Team India: భారత జట్టు ఆఖరి సమరానికి సిద్ధమవుతోంది. ఇంగ్లండ్‌కు లాస్ట్ పంచ్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఈసారి మనం కొట్టే దెబ్బకు ఇంగ్లండ్‌కు రీసౌండ్ అదిరిపోవాలని చూస్తోంది సూర్య సేన.
టీమిండియా ఫైనల్ ఫైట్‌కు రెడీ అవుతోంది. 5 టీ20ల సిరీస్‌ను 3-1తో ఇప్పటికే సొంతం చేసుకుంది భారత్. ముంబై వేదికగా జరిగే సండే ఫైట్‌లో మరోమారు బట్లర్ సేన బెండు తీయాలని చూస్తోంది. ముంబైలో ఇవాళ సాయంత్రం జరిగే ఈ మ్యాచ్ భారత్ కంటే ఇంగ్లండ్‌కు ప్రతిష్టాత్మకమైనది. సిరీస్ ఎలాగూ పోయింది కాబట్టి కనీసం ఇందులోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని ఇంగ్లీష్ టీమ్ భావిస్తోంది. మరోవైపు సూర్య సేన ఈ మ్యాచ్‌ను ఎక్స్‌పెరిమెంట్ యాంగిల్‌లో నుంచి చూస్తోంది. విజయం కంటే కూడా ఆటగాళ్లను పరీక్షించడానికి ఇదో మంచి అవకాశమని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో ముంబై టీ20లో భారత్ ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం..
ఇంకో చాన్స్!
ఇంగ్లండ్‌తో తాజా సిరీస్‌లో భారత బ్యాటింగ్ యూనిట్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఓపెనర్ సంజూ శాంసన్ నుంచి కెప్టెన్ సూర్యకుమార్ వరకు పలువురు బ్యాటర్లు బ్యాడ్ టైమ్ ఫేస్ చేస్తున్నారు. ఫామ్‌తో తంటాలు పడుతున్నారు. అయితే గత మ్యాచ్‌లో ఆడిన అందరు ఆటగాళ్లను దాదాపుగా రిపీట్ చేయాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తోందని తెలిసింది. శాంసన్‌తో పాటు ఇతర బ్యాటర్లకు మరిన్ని అవకాశాలు ఇస్తే వాళ్లు సెటిల్ అవుతారని నమ్మకం పెట్టుకుందట. ఈ నేపథ్యంలో ఓపెనర్‌గా సంజూ, అభిషేక్ శర్మ రావడం ఖాయం. ఫస్ట్ డౌన్‌లో తిలక్ వర్మ, సెకండ్ డౌన్‌లో సారథి సూర్యకుమార్ యాదవ్ ఆడటం పక్కా అనే చెప్పాలి.
మ్యాచ్ విన్నర్ వస్తున్నాడు!
రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబె మిడిలార్డర్ బాధ్యతలు చూసుకుంటారు. అక్షర్ పటేల్ అటు మిడిలార్డర్‌కు ఇటు లోయరార్డర్‌కు మధ్య సమన్వయంగా ఉంటాడు. గత మ్యాచ్‌లో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి కీలక వికెట్లు తీసి గెలిపించిన పేసర్, మ్యాచ్ విన్నర్ హర్షిత్ రాణా ఈసారి నేరుగా ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అతడు టీమ్‌లోకి వస్తే అర్ష్‌దీప్ సింగ్ బెంచ్ మీద కూర్చోవాల్సిందే. ప్రధాన స్పిన్నర్లుగా వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ వ్యవహరిస్తారు.
భారత జట్టు (అంచనా):
సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబె, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి.
ఇవీ చదవండి:
ఆ సీక్రెట్ చెప్పను.. నా భార్య చూస్తోంది: రోహిత్
కోహ్లీ మళ్లీ బ్యాటింగ్‌కు రాకుండానే..!
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి