Share News

Hardik Pandya: ఫ్యూచర్ ప్లాన్ బయటపెట్టిన హార్దిక్.. గట్టి స్కెచ్చే వేశాడుగా..

ABN , Publish Date - Mar 11 , 2025 | 04:53 PM

ICC Champions Trophy 2025: పించ్ హిట్టర్ హార్దిక్ పాండ్యా తన ఫ్యూచర్ ప్లాన్ ఏంటో బయటపెట్టేశాడు. అప్పటివరకు తగ్గేదేలే అని చెప్పాడు. ఆ ట్రోఫీలన్నీ మనకేనని అన్నాడు.

Hardik Pandya: ఫ్యూచర్ ప్లాన్ బయటపెట్టిన హార్దిక్.. గట్టి స్కెచ్చే వేశాడుగా..
Hardik Pandya

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు ఇప్పుడు గుడ్ టైమ్ నడుస్తోంది. ఆ మధ్య భార్య నటాషా స్టాంకోవిచ్‌తో విడాకుల కారణంగా కొన్నాళ్లు మానసికంగా తీవ్ర ఇబ్బంది పడ్డాడు పాండ్యా. అదే సమయంలో ఐపీఎల్-2024లో గుజరాత్ నుంచి ముంబైకి మారడం.. కెప్టెన్సీ కారణంగా భారీ ట్రోలింగ్‌ను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే వీటన్నింటికీ టీ20 వరల్డ్ కప్-2024 పెర్ఫార్మెన్స్‌తో చెక్ పెట్టాడు. ఇప్పుడు చాంపియన్స్ ట్రోఫీ గెలుపులో కీలక పాత్ర పోషించి తన స్టార్‌డమ్, ఇమేజ్‌ను మరింత పెంచుకున్నాడు. అలాంటోడు తన భవిష్యత్తు ప్రణాళికల గురించి క్లారిటీ ఇచ్చాడు. ఇంతకీ పాండ్యా ఏమన్నాడంటే..


అదే నా టార్గెట్

‘చాంపియన్స్ ట్రోఫీ కప్‌ను సొంతం చేసుకోవడం సంతోషంగా ఉంది. టీ20 వరల్డ్ కప్-2024ను గెలిచినప్పటి నుంచి నా దృక్పథం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఐసీసీ టోర్నమెంట్లలో టీమిండియాను విజేతగా నిలపడం మీదే ఫోకస్ చేస్తున్నా. ఇంకా దేని గురించీ ఆలోచించడం లేదు. చాంపియన్స్ ట్రోఫీతో ముగిసిపోయిందని అనుకోవద్దు. ఇప్పుడే అసలు ఆట మొదలైంది. మేం సాధించాల్సింది చాలా ఉంది. కనీసం 5 నుంచి 6 ఐసీసీ ట్రోఫీలు గెలవడం టార్గెట్‌గా పెట్టుకున్నా’ అని హార్దిక్ రివీల్ చేశాడు. చాంపియన్స్ ట్రోఫీ-2017 టైటిల్ మిస్సవడం బాధించిందన్నాడు పాండ్యా. అప్పుడు ఫినిష్ చేయలేకపోయామని.. ఇప్పుడు కప్ అందుకోవడం హ్యాపీగా ఉందన్నాడు. టోర్నీ ఆసాంతం ప్లేయర్లంతా కలసికట్టుగా రాణించడం వల్లే భారత్ విజేతగా ఆవిర్భవించిందన్నాడు. ఇది ఐకమత్యంతో సాధించిన విజయమన్నాడు.


ఇవీ చదవండి:

అందరి అడుగులు పంత్ ఇంటి వైపే

అంత ఈజీనా.. బుమ్రా భార్యకు రాహుల్ కౌంటర్

ట్రోఫీ సెర్మనీకి పాక్ డుమ్మా.. తెగ్గొట్టిన ఐసీసీ

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 11 , 2025 | 04:59 PM