Share News

IPL 2025: ఐపీఎల్‌కు కేంద్రం షాక్.. క్యాష్ రిచ్ లీగ్‌లో అవి బంద్

ABN , Publish Date - Mar 10 , 2025 | 02:20 PM

DGHS: ఐపీఎల్‌కు గట్టి షాక్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇకపై క్యాష్ రిచ్ లీగ్‌లో అవి కనిపించకూడదని స్పష్టం చేసింది. మరి.. కేంద్రం ఏ విషయంలో సీరియస్ అయిందో ఇప్పుడు చూద్దాం..

IPL 2025: ఐపీఎల్‌కు కేంద్రం షాక్.. క్యాష్ రిచ్ లీగ్‌లో అవి బంద్
IPL 2025

చాంపియన్స్ ట్రోఫీ-2025 ఎట్టకేలకు ముగిసింది. 3 వారాల పాటు అందర్నీ అలరించిన మెగా టోర్నీ భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన సండే ఫైట్‌తో కంప్లీట్ అయింది. దీంతో ఇక అందరి ఫోకస్ క్రమంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొత్త సీజన్ వైపు మళ్లుతోంది. ఇప్పటికే అన్ని జట్లు నయా సీజన్ కోసం ప్రిపరేషన్స్ స్టార్ట్ చేశాయి. ఈ తరుణంలో క్యాష్ రిచ్ లీగ్ నిర్వాహకులకు బడా షాక్ తగిలింది. దాని గురించి మరింతగా తెలుసుకుందాం..


ఆ యాడ్స్‌పై బ్యాన్

ఐపీఎల్‌కు బిగ్ షాక్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. క్యాష్ రిచ్ లీగ్ మ్యాచుల ప్రసారం సమయంలో వచ్చే పొగాకు, మద్యం అడ్వర్టయిజ్‌మెంట్ల మీద బ్యాన్ విధించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఐపీఎల్‌ చైర్‌పర్సన్‌కు లేఖ రాసింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. సరోగసీ యాడ్స్‌ను కూడా టెలికాస్ట్ చేయొద్దని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ సింగ్ ధుమాల్‌కు రాసిన లేఖలో హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ అతుల్ గోయల్‌ స్పష్టం చేశారు.


బోర్డు ఏం చేస్తుందో..

బీసీసీఐ నిర్వహించే టోర్నమెంట్లు, బోర్డుకు సంబంధించిన స్పోర్ట్స్ ఫెసిలిటీ సెంటర్లలో టొబాకో, ఆల్కహాల్, సరోగసీకి సంబంధించిన యాడ్స్‌ను ప్రదర్శించొద్దని కేంద్రం పేర్కొంది. ఐపీఎల్‌లో పాల్గొనే ఆటగాళ్లతో పాటు కామెంటేటర్లు కూడా అలాంటి ప్రొడక్ట్స్‌ను ప్రమోట్ చేయకుండా అడ్డుకోవాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోరింది. క్రికెటర్లు యూత్‌కు రోల్ మోడల్స్ అని తెలిపింది. దేశంలో అతిపెద్ద క్రీడా సంబురమైన ఐపీఎల్‌ మీద సామాజిక బాధ్యత ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని.. పొగాకు, ఆల్కహాల్ ఉత్పత్తుల యాడ్స్ మీద బ్యాన్ విధించాలని రిక్వెస్ట్ చేసింది. కాగా, మార్చి 22 నుంచి ఐపీఎల్ కొత్త సీజన్ షురూ కానుంది. భారీ ఆదాయం సమకూర్చే పైతరహా యాడ్స్‌ను వద్దనుకుంటే బోర్డుకు నష్టం వాటిల్లే చాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర లేఖపై క్యాష్ రిచ్ లీగ్ నిర్వాహకులు ఎలా స్పందిస్తారో చూడాలి.


ఇవీ చదవండి:

ఆ ఒక్కడి వల్లే ఓడాం: కివీస్ కెప్టెన్

ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు: కోహ్లీ

గజినీలా మారిన రోహిత్.. కప్పు మర్చిపోయి..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 10 , 2025 | 02:20 PM