Share News

Akash Deep Family: ఇంత బాధ ఎలా తట్టుకున్నాడు.. ఆకాశ్‌దీప్ కష్టం ఎవరికీ రాకూడదు!

ABN , Publish Date - Jul 07 , 2025 | 10:44 AM

టీమిండియా యువ పేసర్ ఆకాశ్‌దీప్ ఓవర్‌నైట్ స్టార్‌గా మారాడు. ఒక్క పెర్ఫార్మెన్స్‌తో అంతా తన గురించి మాట్లాడుకునేలా చేశాడు. అయితే అతడు పడిన కష్టం గురించి తెలిసి అంతా బాధపడుతున్నారు.

Akash Deep Family: ఇంత బాధ ఎలా తట్టుకున్నాడు.. ఆకాశ్‌దీప్ కష్టం ఎవరికీ రాకూడదు!
Akash Deep

ఆకాశ్‌దీప్.. ఇప్పుడు భారత క్రికెట్‌‌లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇది. సింగిల్ పెర్ఫార్మెన్స్‌తో భారీ క్రేజ్ దక్కించుకున్నాడీ రైటార్మ్ పేసర్. ఎడ్జ్‌బాస్టన్‌లో ఓటమి ఎరుగని ఇంగ్లండ్ అహంకారాన్ని అణచడంలో కీలకపాత్ర పోషించాడు ఆకాశ్‌దీప్. ఇక్కడ జరిగిన రెండో టెస్ట్‌లో ఏకంగా 10 వికెట్లతో దుమ్మురేపాడు. జో రూట్, హ్యారీ బ్రూక్, ఓలీ పోప్, బెన్ డకెట్ లాంటి స్టార్ బ్యాటర్లను భయపెట్టి ఔట్ చేశాడు. బుమ్రా లేని లోటును భర్తీ చేస్తూ టీమిండియాకు కొత్త హీరోగా అవతరించాడు. దీంతో ఆకాశ్‌దీప్ ఆటతీరు గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో అతడు జీవితంలో పడిన కష్టాలు, బాధలు తలచుకొని ఎమోషనల్ అవుతున్నారు.

team-india.jpg


కష్టాలు చుట్టుముట్టినా..

టీమిండియాలోకి వచ్చేందుకు పెద్ద యుద్ధమే చేశాడు ఆకాశ్‌దీప్. క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకునేందుకు అంతగా ఆసక్తి చూపని బిహార్ నుంచి వచ్చాడీ పేసర్. 6 నెలల వ్యవధిలోనే అటు తండ్రి, ఇటు సోదరుడ్ని కోల్పోయాడు. ఇలా ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా క్రికెట్‌ను మాత్రం వదల్లేదు. జెంటిల్మన్ గేమ్‌ను కెరీర్‌లా కాకుండా జీవితంలా భావించి ఎదిగాడు ఆకాశ్‌దీప్. స్వతహాగా బ్యాటర్ అయిన ఆకాశ్‌దీప్.. అవకాశాల కోసం పేసర్‌గా మారాడు. ఇలా ఎన్నో కష్టాలు, బాధలకు ఓర్చి ఈ స్థాయికి చేరుకున్నాడు. అయితే ఇప్పుడు సక్సెస్ చూస్తున్న సమయంలో ఆకాశ్‌దీప్ సోదరి క్యాన్సర్ బారిన పడటం అతడ్ని మరింతగా కలచివేసింది. ఇదే విషయాన్ని తాజాగా వెల్లడించాడీ స్పీడ్‌స్టర్.

ind-vs-eng.jpg


ఆమె సంతోషం కోసమే..

‘ఈ విషయం నేను ఇప్పటివరకు ఎవ్వరికీ చెప్పలేదు. మా పెద్దక్క క్యాన్సర్ బారిన పడింది. 2 నెలలుగా ఆ మహమ్మారితో ఆమె పోరాడుతోంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. తను వేగంగా కోలుకుంటోంది. ఇంగ్లండ్‌పై నా ప్రదర్శన చూసి తను చాలా సంతోషించి ఉంటుంది. ఈ గెలుపును, ఈ ప్రదర్శనను తనకు అంకితం చేస్తున్నా. మా అక్క కళ్లలో ఆనందం చూడాలని కోరుకున్నా. ఎట్టకేలకు అది నెరవేరింది’ అని చెబుతూ భావోద్వేగానికి లోనయ్యాడు ఆకాశ్‌దీప్. అతడి మాటలకు నెటిజన్స్ ఎమోషనల్ అవుతున్నారు. ఇంత బాధ లోపల దాచుకొని ఎలా ఆడగలుగుతున్నావ్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఆకాశ్ అందరికీ స్ఫూర్తి అని మెచ్చుకుంటున్నారు.


ఇవీ చదవండి:

మమ్మల్ని అతడే ఓడించాడు: మెకల్లమ్

గిల్ కామెంట్‌కు నవ్వాగదు!

సిరాజ్ స్టన్నింగ్ క్యాచ్ చూశారా..

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 07 , 2025 | 10:52 AM