Share News

Ashes 2025-26: చెలరేగిన జోష్‌ టంగ్‌.. ‌కుప్పకూలిన ఆసీస్

ABN , Publish Date - Dec 26 , 2025 | 11:25 AM

నాలుగో టెస్టులో మ్యాచ్ ప్రారంభంలో ఇంగ్లాండ్ పేసర్లు గస్‌ అట్కిన్సన్‌, జోష్‌ టంగ్‌ ఆస్ట్రేలియా బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ఇంగ్లాండ్‌ బౌలర్ జోష్ టంగ్ చెలరేగడంతో ఆసీస్ జట్టు 152 పరుగుల స్వల్ప స్కోరుకే ఆలౌటైంది.

Ashes 2025-26: చెలరేగిన జోష్‌ టంగ్‌.. ‌కుప్పకూలిన ఆసీస్
Ashes 2025

ఇంటర్నెట్ డెస్క్: యాషెస్ సిరీస్(Ashes 2025-26)లో భాగంగా మెల్ బోర్న్ వేదికగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. ఇంగ్లాండ్‌ బౌలర్ జోష్ టంగ్ చెలరేగడంతో ఆసీస్ జట్టు స్వల్ప స్కోరుకే ఆలౌటైంది. సొంతగడ్డపై ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌ను కంగారూలు ఇప్పటికే సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఐదు టెస్టులలో భాగంగా తొలి మూడు గెలిచి ఆసీస్‌ 3-0తో ఆధిక్యంలో ఉంది.


నాలుగో టెస్టులో మ్యాచ్(Australia vs England Test) ప్రారంభంలోనే ఇంగ్లాండ్ పేసర్లు గస్‌ అట్కిన్సన్‌, జోష్‌ టంగ్‌ ఆస్ట్రేలియా బ్యాటర్లకు చుక్కలు చూపించారు. డేంజరస్‌ ఓపెనర్‌ ట్రవిస్‌ హెడ్‌ (12)ను స్వల్ప స్కోర్ కే అట్కిన్సన్‌ బౌల్డ్‌ చేసి పెవిలియన్ పంపాడు. మరో ఓపెనర్‌ జేక్‌ వెదరాల్డ్‌ (10)ను టంగ్‌ ఔట్ చేశాడు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన మార్నస్‌ లబుషేన్‌ (6)తో పాటు కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ (9) వికెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్న టంగ్‌.. కంగారు జట్టును కోలుకోలేని దెబ్బకొట్టాడు. తర్వాత ఉస్మాన్‌ ఖవాజా (29)ను అట్కిన్సన్‌, అలెక్స్‌ క్యారీ (20)ను బెన్‌ స్టోక్స్‌ పెవిలియన్‌ చేర్చారు. ఆల్‌రౌండర్‌ కామెరాన్‌ గ్రీన్‌ (17) రనౌట్‌ కాగా.. టెయిలెండర్లలో మైకేల్‌ నాసర్‌ (35) కాసేపు పోరాడగా.. టంగ్‌ అతడిని బౌల్డ్‌ చేశాడు.


చివరకు ఆసీస్‌ 45.2 ఓవర్లలో కేవలం 152 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. ఇంగ్లిష్‌ జట్టు బౌలర్లలో జోష్‌ టంగ్‌(Josh Tongue five wickets) ఐదు వికెట్లతో చెలరేగగా.. అట్కిన్సన్‌కు రెండు, బ్రైడన్‌ కార్స్‌, స్టోక్స్‌లకు చెరో వికెట్‌ పడగొట్టారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తోంది. ఇంగ్లాండ్19 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 68 పరుగులు చేసింది. ఇంగ్లీష్ బ్యాటర్లు కూడా కంగారుల దెబ్బకు విలవిల్లాడుతున్నారు. స్టార్క్ , మైకేల్ , స్కాట్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. ప్రస్తుతం 84 పరుగుల ఆధిక్యంలో ఆస్ట్రేలియా ఉంది.



ఇవి కూడా చదవండి

ఐపీఎల్‌లో రిజెక్ట్.. సీన్ కట్ చేస్తే.. డబుల్ సెంచరీ చెలరేగాడు.. ఎవరంటే?

Vignesh Puthur Creates History: 32 ఏళ్ల రికార్డ్ బద్దలు.. చరిత్ర సృష్టించిన విజ్ఞేష్

Updated Date - Dec 26 , 2025 | 11:41 AM