Share News

Ashes 2025 Boxing Day Test: పరువు కోసం ఇంగ్లండ్‌ పోరాటం

ABN , Publish Date - Dec 26 , 2025 | 06:22 AM

యాషెస్‌ సిరీ్‌సను 3-0తో ఇప్పటికే సొంతం చేసుకొన్న ఆస్ట్రేలియా అదే జోరును కొనసాగించాలనుకొంటోంది....

Ashes 2025 Boxing Day Test: పరువు కోసం ఇంగ్లండ్‌ పోరాటం

ఉ. 5 గం.నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..

  • క్లీన్‌స్వీ్‌పపై ఆసీస్‌ కన్ను

  • బాక్సింగ్‌ డే టెస్ట్‌ నేటి నుంచి

మెల్‌బోర్న్‌: యాషెస్‌ సిరీ్‌సను 3-0తో ఇప్పటికే సొంతం చేసుకొన్న ఆస్ట్రేలియా అదే జోరును కొనసాగించాలనుకొంటోంది. మరోవైపు ఐదు టెస్ట్‌ల సిరీ్‌సలో మిగిలిన రెండు మ్యాచ్‌లు నెగ్గి పరువు దక్కించుకోవాలని ఇంగ్లండ్‌ పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో శుక్రవారం నుంచి జరిగే బాక్సింగ్‌ డే టెస్ట్‌లో బెన్‌ స్టోక్స్‌ సేన అద్భుతం చేయాలనుకొంటోంది.

జట్టు కూర్పుపై

సందేహాలున్నా..: ఆసీస్‌ జట్టు నాలుగో టెస్ట్‌లో కూడా ఇదే జోష్‌తో బరిలోకి దిగనుంది. గాయపడిన స్పిన్నర్‌ నాథన్‌ లియాన్‌ స్థానంలో మర్ఫీని తీసుకొన్నా.. పిచ్‌పై పచ్చదనం కనిపిస్తుండడంతో మొత్తం పేసర్లతో బరిలోకి దిగనుంది. పేసర్‌ జే రిచర్డ్‌సన్‌కు తుది జట్టులో చోటుదక్కింది. ఉస్మాన్‌ ఖవాజా, కామెరూన్‌ గ్రీన్‌ బ్యాటింగ్‌ స్థానాల్లో మార్పులు చేసే అవకాశం ఉంది. ఫామ్‌లో ఉన్న అలెక్స్‌ క్యారీ అదే జోరు కొనసాగించాలని జట్టు కోరుకొంటోంది. మరోవైపు తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఇంగ్లండ్‌.. సిరీ్‌సలో ఎలాగైనా బోణీ కొట్టాలనుకొంటోంది. టీమ్‌ బ్యాటింగ్‌ ఘోరంగా ఉన్న నేపథ్యంలో పోప్‌పై వేటేసింది. గాయంతో పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ సిరీ్‌సకు దూరమవడం పెద్ద దెబ్బే.

ఇవి కూడా చదవండి

ఐపీఎల్‌లో రిజెక్ట్.. సీన్ కట్ చేస్తే.. డబుల్ సెంచరీ చెలరేగాడు.. ఎవరంటే?

బంగ్లాదేశ్‌లో ఆగని అరాచకాలు.. మరో హిందువు దారుణ హత్య..

Updated Date - Dec 26 , 2025 | 06:22 AM