Shashi Tharoor: వైభవ్‌ను జట్టులోకి తీసుకోండి
ABN , Publish Date - Dec 26 , 2025 | 06:13 AM
యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీని టీమిండియా సీనియర్ జట్టులోకి తీసుకోవాలని కాం గ్రెస్ ఎంపీ శశిథరూర్ ‘ఎక్స్’ వేదికగా బీసీసీఐకి విజ్ఞప్తి చేశారు....
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్
న్యూఢిల్లీ: యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీని టీమిండియా సీనియర్ జట్టులోకి తీసుకోవాలని కాం గ్రెస్ ఎంపీ శశిథరూర్ ‘ఎక్స్’ వేదికగా బీసీసీఐకి విజ్ఞప్తి చేశారు. ‘కొంతకాలం కిందట క్రికెట్‌లో 14 ఏళ్ల వయసులో అరంగేట్రం చేసిన సచిన్ టెండూల్కర్ ఎన్ని అద్భుతాలు చేశాడో చూశాం. అతనేంటో మనందరికీ తెలుసు. మరి ఇప్పుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? భారత్ కోసం వైభవ్ సూర్యవంశీని జట్టులోకి తీసుకోండి’ అని పోస్టు చేశారు. బుధవారం విజయ్ హజారే ట్రోఫీలో సూర్యవంశీ 84 బంతుల్లోనే 190 పరుగులు చేయడం తెలిసిందే. లిస్ట్-ఎ క్రికెట్‌లో ఇదే వేగవంతమైన 150 కావడం విశేషం.
ఇవి కూడా చదవండి
ఐపీఎల్‌లో రిజెక్ట్.. సీన్ కట్ చేస్తే.. డబుల్ సెంచరీ చెలరేగాడు.. ఎవరంటే?
బంగ్లాదేశ్‌లో ఆగని అరాచకాలు.. మరో హిందువు దారుణ హత్య..