Share News

ICC Awards: అభిషేక్ శర్మ, స్మృతి మంధానకు ఐసీసీ అవార్డ్!

ABN , Publish Date - Oct 16 , 2025 | 07:31 PM

అభిషేక్ శర్మ, భారత మహిళల స్టార్ ప్లేయర్ స్మృతి మంధానకు అరుదైన అవార్డ్ దక్కింది. ఈ ప్లేయర్లకు 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్' వరించింది.

ICC Awards: అభిషేక్ శర్మ, స్మృతి మంధానకు ఐసీసీ అవార్డ్!
ICC Awards

టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ, భారత మహిళల స్టార్ ప్లేయర్ స్మృతి మంధానకు అరుదైన అవార్డ్ దక్కింది. సెప్టెంబర్ నెలలో ఉత్తమ ప్రదర్శన కనబర్చినందుకు ఈ ఇద్దరి ప్లేయర్లకు 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్' వరించింది. దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ 2025 టోర్నీలో అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన విషయం తెలిసిందే.


ఆసియా కప్ 2025 టోర్నీలో 7 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ శర్మ(Abhishek Sharma) 200 స్ట్రైక్‌రేట్, 44.58 సగటుతో 314 పరుగులు చేశాడు. అంతేకా ఆ టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డ్ అందుకున్నాడు. అతని అద్భుత బ్యాటింగ్ తో ఈ టోర్నీలో టీమిండియా ఓటమి అనేది లేకుండా విజేతగా నిలిచింది. అలానే ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ వరల్డ్ నెంబర్ వన్ టీ20 బ్యాటర్‌గా కూడా కొనసాగుతున్నాడు.

అభిషేక్ శర్మ పాటు ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్ కూడా ఈ అవార్డ్ రేసులో నిలిచాడు. జింబాబ్వే ప్లేయర్ బ్రియాన్ బెన్నెట్ కూడా పోటీ పడగా.. అభిషేక్ శర్మకే(Abhishek Sharma) ఈ అవార్డ్ వరించింది. అభిషేక్ శర్మ కెరీర్‌లో ఇదే తొలి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్(ICC Awards) కావడం గమనార్హం.


ఇక స్మృతి మంధాన(Smriti Mandhana) కూడా ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చింది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో 58, 117, 125 పరుగులతో సత్తా చాటింది. ఈ సిరీస్‌లో మంధాన 50 బంతుల్లోనే సెంచరీ బాది ఆకట్టుకుంది. మంధానతో పాటు సౌతాఫ్రికా(South Africa) బ్యాటర్ టాజ్మిన్ బ్రిట్స్, పాకిస్థాన్ ప్లేయర్ సిద్రా అమిన్ ఈ అవార్డ్ రేసులో నిలవగా మంధాననే వరించింది. ఈ అవార్డు సంతోషంగా ఉందని మంధాన(Smriti Mandhana) తెలిపింది.


ఇవి కూడా చదవండి

Commonwealth Games 2030: అహ్మదాబాద్‌లో కామన్వెల్త్‌ క్రీడలు

India Team Departs for Australia: ఆసీస్‌కు పయనం

Williamson Joins LSG : IPL 2026లో కొత్తగా కనిపించనున్న కేన్ మామ!

Updated Date - Oct 16 , 2025 | 09:18 PM